అమ్మ అంటే కనిపించే దేవత అని అర్థం. అయితే నేటి కాలంలో కొందరు.. అమ్మ అనే మాటకే అపకీర్తి తెస్తున్నారు. పరాయి వారి మోజులో పడి పిల్లలను దారుణంగా హింసిస్తారు. తాజాగా ఓ మహిళ రెండో భర్త.. ఆమె పిల్లల చర్మాన్ని కత్తెరించాడు.
ఈ భూమి మీద బిడ్డలపై తల్లి చూపినంత ప్రేమ మరెవ్వరూ చూపించలేరు. అమ్మ ప్రేమకు హద్దు ఉండదు. అలానే స్వార్థం లేని ప్రేమ అంటే కేవలం తల్లిది మాత్రమే. అందుకే అమ్మను కనిపించే దేవతలా అందరు భావిస్తుంటారు. అయితే నేటి కాలంలో కొందరు.. అమ్మ అనే మాటకే అపకీర్తి తెస్తున్నారు. పరాయి వారి మోజులో పడి పిల్లలను దారుణంగా హింసిస్తారు. తాజాగా ఓ మహిళ రెండో భర్త.. ఆమె పిల్లల చర్మాన్ని కత్తెరించాడు. ఈ దాష్టికానికి ఆమె కూడా సాయం చేసింది. వారి వేధింపులకు తట్టుకోలేకపోయిన ఆ పసిపిల్లలు పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఈ ఘోరమైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అమెరికాలోని టెక్సాస్ గన్నర్ ఫార్ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు అయిదు , తొమ్మిదేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె తొలి భర్తతో విడిపోయి మేగాన్ మే ఫార్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్త, పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. అయితే తరచూ వారిద్దరు పిల్లలను వివిధ రకాల వేధింపులకు గురి చేసే వారని సమాచారం. ఆ దంపతులు.. పిల్లలిద్దరికి పచ్చబొట్టు వేయించాలని అనుకున్నారు. అయితే ఆ టాటూ వేయించుకోవడం ఆ పిల్లలకు ఇష్టం లేదు. ఆ పిల్లలను తాడుతో కట్టేసి.. నోట్లో దుస్తులు కుక్కి.. కళ్లకు గంతలు కట్టారు. ఇలా ఒక పాపకు కాలుపై, మరొక పాపకు భుజంపై పచ్చబొట్టును పొడిచారు.
కొన్ని రోజులు గడిచిన తరువాత ఓ రోజు ఈ పిల్లల అసలు తండ్రి.. తన మాజీ భార్య ఇంటికి వచ్చాడు. పిల్లలను చూడడానికి వచ్చిన అతడికి ఈ దారుణం తెలిసింది. పోలీసులు తమను అరెస్టు చేస్తారని గన్నర్, మెగాన్ భయపడ్డారు. పిల్లలు వేసిన టాటూలను చేరిపేసేందుకు నిమ్మరసంతో రుద్దడం, గీరడం వంటివి చేశారు. అయినా ఆ పచ్చబొట్లు చెరిగిపోక పోవడంతో చివరికి పిల్లల చర్మాన్ని కత్తిరించి వాటిని తొలగించారు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారుల వద్దకు వెళ్లారు. ఆ పిల్లలను పరిశీలించగా వారి శరీరంపై లోతైనా గాయాలు కనిపించాయి. పిల్లలను ఘోరంగా హింసించినందుకు వెంటనే ఆ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.