సతీష్ అన్న భర్త పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ..
ప్రేమను వ్యక్త పరిచే విధానాల్లో ట్యాటూలు వేయించుకోవటం ఒకటి. ఎదుటి వ్యక్తి మీద ఉన్న ఇష్టాన్ని వారి పేర్లు పచ్చ వేయించుకోవటం ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ట్యాటూలకు కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. చరిత్ర సంగతి పక్కన పెడితే.. తాజాగా, ఓ మహిళ తన భర్త మీద ఉన్న ప్రేమను ఎంతో వెరైటీ తెలియజేసింది. ఇంత వరకు ఎవ్వరూ చేయని విధంగా తన ప్రేమను వ్యక్త పర్చింది. తన తలపై భర్త పేరును పచ్చ పొడిపించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ మహిళకు భర్త అంటే ఎంతో ప్రేమ. ఆయన మీద ఉన్న ప్రేమను వ్యక్త పర్చడానికి ఓ వినూత్నమైన పని చేసింది. ఆమె తన నుదురుపై భర్త పేరు పచ్చ పొడిపించుకుంది.
సతీష్ అన్న భర్త పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నువ్వు నిజంగా గ్రేట్.. నీ భర్త చాలా అదృష్టవంతుడు’’.. ‘‘ నిలాంటి భార్యలు ఈ కాలంలో ఎక్కడ ఉన్నారు. మీరు చాలా గ్రేట్’’.. ‘‘ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. భర్త మీద ఎంత ప్రేముంటే మాత్రం ఇలా చేస్తారా?’’.. ‘‘ మీకేమైనా పిచ్చా.. భర్త మీద ఉన్న ప్రేమను చూపించాల్సిన దారులు చాలా ఉన్నాయి’’.. ‘‘ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవటానికి అందరూ ఈ విధంగా చేస్తున్నారు’’ అంటూ మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
View this post on Instagram
A post shared by king_maker_tattoo_studio 🇮🇳 (@king_maker_tattoo_studio)