చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటమిపాలైంది. అయినా ఆ జట్టు సారథి డుప్లెసిస్ ఆడిన తీరుకు అందర్నీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా అతడి రిబ్స్ మీద కనిపించిన ఒక టాటూ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
ఐపీఎల్ పదహారో సీజన్ ముందుకు వెళ్తున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. గత వారం రోజులుగా చూసుకుంటే ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులని మునివేళ్లపై నిల్చొని చూసేలా చేస్తున్నాయి. చివరి ఓవర్ వరకు మ్యాచులు వెళ్తుండటంతో ఎవరు గెలుస్తారనేది చెప్పలేని పరిస్థితి. సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగింది. బిగ్ స్కోర్ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 రన్స్ స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. చెన్నై నిర్దేశించిన 227 రన్స్ టార్గెట్‌ను ఛేదించడంలో ఆ జట్టు ఫెయిల్ అయ్యింది. సారథి ఫాఫ్ డుప్లెసిస్ (33 బాల్స్‌లో 62), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (36 బాల్స్‌లో 76) మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. అయినా ఇద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
చెన్నైతో మ్యాచ్‌లో బెంగళూరు ఓడినప్పటికీ డుప్లెసిస్-మ్యాక్స్‌వెల్ జోడీ ఆడిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. బౌండరీలు, సిక్సులతో వీరు చేసిన విధ్వంసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక, ఇదే మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా కనిపించిన ఒక దృశ్యం నెటిజన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆర్సీబీ బ్యాటింగ్ టైమ్‌లో 13వ ఓవర్ పూర్తయిన తర్వాత డుప్లెసిస్ కాస్త ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. అప్పటికే అతడి పక్కటెముకల చుట్టూ బ్యాండ్ కట్టి ఉంది. సిబ్బంది సాయంతో దాన్ని సరిచేసుకున్నాడు ఫాఫ్. ఈ క్రమంలో డుప్లెసిస్ రిబ్స్ మీద ఉన్న టాటూను అందరూ గుర్తించారు. క్రికెట్ వర్గాల్లో ఈ టాటూపై పెద్ద చర్చే నడుస్తోంది.
సోషల్ మీడియాలో ఆర్సీబీతో పాటు ఇతర జట్ల అభిమానులు కూడా డుప్లెసిస్ టాటూపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ పచ్చబొట్టు ఏంటి? అదే భాష? దాని అర్థం ఏంటనేది ఆరా తీస్తున్నారు. డుప్లెసిస్ బాడీపై చాలా టాటూలు ఉన్నా ఇది మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. సోషల్ మీడియాలో చర్చల తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆ టాటూ అరబిక్ భాషలోని ఒక పదమట. దీని అర్థం ఫజెల్ (దేవుడి దయ). దేవుడి దయ వల్ల తన లైఫ్‌లో ఊహించని సానుకూల మార్పులు జరగడం వల్ల డుప్లెసిస్ ఈ పచ్చబొట్టును వేయించుకున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.
Played such an iconic knock at 38 even when he wasn’t fully fit. Appreciation tweet for Captain FAF. ❤️
You just can’t scroll down without liking this! #RCBvsCSK pic.twitter.com/JztllvBuYA
— Sexy Cricket Shots (@sexycricketshot) April 17, 2023