క్రొయేషియాలోని లెగ్రాడ్ అనే పట్టణం ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు. అక్కడ జనాభా విపరీతంగా తగ్గుతోంది. అక్కడ ప్రస్తుతం ఎటు చూసినా ఖాళీ ఇళ్లే కనిపిస్తున్నాయి. లెగ్రాడ్ పట్టణం గత కొన్నేళ్లుగా ప్రజలు లేక వెలవెలబోతోంది. సౌకర్యాలు అంటూ లెగ్రాడ్ లోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో గత వందేళ్లుగా జనాభా తగ్గిపోయింది. మళ్ళీ ప్రజలను లెగ్రాడ్ పట్టణంలో నివసించేలా చేయాలనీ ప్రభుతం నిర్ణయించుకుంది. ఈ పట్టణం వైపు దృష్టి పెట్టేలా చేయాలనీ మళ్ళీ లెగ్రాడ్ ప్రజలతో నిండిపోవాలని భావించింది. అందుకే సరికొత్త ప్లాన్ తో ప్రజల ముందుకొచ్చింది. ఒక్కో ఇంటిని దాదాపుగా రూ.12 కు (అక్కడి మారకంలో కునా అంటారు) విక్రయిస్తోంది.
నీలి రంగులో కనువిందు చేసే సముద్రాలు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. కాలుష్యానికి, ఉరుకుల పరుగుల బిజీ నగర జీవితానికి దూరంగా ఓ అందమైన ప్రదేశం అది. ఎవరైనా సరే ఆ మొత్తం చెల్లించి అక్కడ ఇంటిని కొనుగోలు చేయవచ్చు. ఇక అక్కడ ఇంటిని కొనుగోలు చేసేవారికి ఆ ప్రభుత్వం ఇంటి రిపేర్‌కు 25వేల కునాలను (రూ. 3 లక్షల ఆర్థికసాయం) చెల్లించనుంది. కానీ అక్కడ కనీసం 15 ఏళ్ల పాటు నివసించాలి.
అలాగే ఇళ్లను కొనేవారి వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. ధనవంతులు అయి ఉండాలి. ఈ రూల్స్‌కు ఓకే అయితే అక్కడ ఇంటిని కొనుగోలు చేసి దర్జాగా ఉండవచ్చు. రోజూ పచ్చని ప్రకృతిలో కాలం గడపవచ్చు. ఇప్పటికే అక్కడ 17 ఇళ్లను విక్రయించారు. ఇంకా ఖాళీగానే ఇళ్లు ఉన్నాయి. మరి ఆసక్తి ఉన్నవారు ఒక్క లుక్కేయండి.!