బాలీవుడ్ లో స్టార్ కమెడియన్, నటుడు కపిల్ శర్మ హూస్ట్ గా వచ్చిన ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ తో ఎంతోమంది నటులు స్టార్ కమెడియన్లుగా పాపులర్ అయ్యారు. ప్రముఖ సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు తీసుకుంటూ.. కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు.
బాలీవుడ్ లో 2013లో కపిల్ శర్మ హూస్ట్ గా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షో బాగా పాపులర్ అయ్యింది. ఈ షోలో కపిల్ శర్మ తో పాటు ఇతర కమెడియన్లు చేసే స్కిట్స్ అభిమానులను ఎంతగానో నవ్వించారు. 2016 నుంచి కామెడీ నైట్స్ విత్ కపిల్ ఆన్ కలర్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. ఈ కామెడీ షోలో కపిల్ శర్మతో పాటు ఎంతోమంది ఆర్టిస్టులు మంచి పేరు సంపాదించుకొని వెండితెరపై ఛాన్సులు దక్కించుకున్నారు. అలాంటి వారిలో సునీల్ గ్రోవర్ ఇకరు. బుల్లితెరపై ఎన్నో కామెడీ షోల్లో పాల్గొంటూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు సునీల్ గ్రోవర్. బుల్లితెరపైనే కాదు పలు పంజాబ్ చిత్రాల్లో నటించి తన కామెడీ మార్క్ చాటుకున్నాడు. తాజాగా సునీల్ గ్రోవర్ రోడ్డు ప్రక్కన గొడుగులు అమ్ముతూ, చపాతీలు కాల్చుతూ అభిమానులకు షాక్ ఇచ్చాడు. స్టార్ కమెడియన్ కి ఇలాంటి పరిస్థితి ఏంటీ అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా సినిమా, బుల్లితెరపై నటించిన నటీనటులు సరైన సక్సెస్‌లు కలిసి రాక చాలా ఇబ్బందులు పడుతుంటారు. నటనకు దూరంగా ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకంటూ జీవితాన్ని గడుపుతుంటారు. కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగాలేక సహాకం కోసం ఎదురు చూస్తుంటారు. బాలీవుడ్ లో ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోలో తనదైన కామెడీ పండించి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ గ్రోవర్. కామెడీ నైట్స్ విత్ కపిల్‌లో గుత్తి, డాక్టర్ మషూర్ గులాటి, రింకూ దేవి పాత్రల్లో నటించిన సులీల్ గ్రోవర్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాడు. సునీల్ గ్రోవర్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన కామెడీ అంటే ఇష్టపడని వారు ఉండరు.. సెలబ్రెటీలతో ఆయన చేసే కామెడీని చూసి పడీ పడీ నవ్వుతారు.
అలాంటిది సునీల్ గ్రోవర్ రోడ్డు పక్కన గొడుగు అమ్ముతు, మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ, చపాతీలు చేస్తూ కనిపించడంతో అభిమానులు ఒక్కసారే షాక్ అయ్యారు. ఇటీవల కామెడీ నైట్స్ విత్ కపిల్ షో లో కనిపించడం మానేశారు. మరి సునీల్ గ్రోవర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? కాకపోతే ఇవ్వన్నీ సినిమా ప్రమోషన్ కోసం మాత్రం చేసినట్లు కనిపించడం లేదే. ఇలా ఆయన ఎందుకు చేశారు అన్న విషయం మాత్రం రిలీల్ కాలేదు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఒక సెలబ్రెటీ అయి ఉండి.. సామాన్యుడిలా ప్రవర్తించడం నిజంగా గొప్ప విషయం అంటూ ఆయన పై ప్రశంశలు కురిపిస్తున్నారు.