పార్లమెంటులో ఎంపీగారి బూతు వీడియో నిర్వాకం బ్రిటన్ పార్లమెంటులో సంచలనంగా మారింది. యూకేలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ నీల్ పరీశ్ పార్లమెంటులో అశ్లీల వీడియో చూశారు. ఓ కంట కనిపెట్టిన మహిళా ఎంపీలు స్పీకర్ కు తెలియజేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో అయ్యగారి నిర్వాకంపై సొంత పార్టీ నేతలపై కసరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: అప్పుడు ఎన్టీఆర్ పట్ల దుర్మార్గంగా వ్యవహరించి.. CM సీటు నుంచి దించేశారు: KCR
తాజాగా ఈ అంశం యూకేలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇదే అదునుగా భావించిన ప్రతిపక్షాలు అధికార ప్రభుత్వంపై ఒంటికాలుపై లేవడంతో ఈ ఘటన సంచనలంగా మారింది. ఇక వెంటనే స్పందించిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ అశ్లీల వీడియో వీక్షణం ఉదంతాన్ని సీరియస్ గా తీసుకుంది. దీంతో నీల్ పరీశ్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో నీల్ పరీశ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక చట్టసభలో ఎంపీ బూతు పురాణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.