మార్కెట్లోకి ఏ స్మార్ట్ వచ్చినా దాని డూప్లికేట్ ఫోన్ తయారుచేయడం చైనా వాళ్ళ ప్రత్యేకత. ప్రపంచంలోనే నంబర్ వన్ కాపీ క్యాట్ గాళ్ళుగా పేరొందిన చైనా వాళ్లకి కాపీ కొట్టడమే కాదు.. కొత్త ఫోన్లను సృష్టించడం కూడా వచ్చు. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ని సృష్టించి చర్చనీయాంశంగా మారాడో చైనా మనిషి. ఇప్పటికే సామ్ సంగ్, ఒప్పో, మోటోరోలా వంటి పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు మడతపెట్టే స్మార్ట్ ఫోన్లను తయారుచేశాయి. అయితే మార్కెట్లోకి ఎన్ని ఫోన్లు వచ్చినా, ఎన్ని కొత్త రకాల మోడల్స్ వచ్చినా ఐఫోన్ కున్న క్రేజ్ మాత్రం సెపరేట్. ఐఫోన్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఫోల్డబుల్ ఐఫోన్ ఒకటి వస్తే బాగుణ్ణు అని ఎదురుచూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాపిల్ కంపెనీ కూడా ఫోల్డబుల్ ఐఫోన్ ని తయారుచేసే పనిలో పడింది. అయితే ఆ ఫోన్లు రావడానికి రెండేళ్లు పట్టచ్చు, మూడేళ్లు పట్టచ్చు, ఐదేళ్లు పట్టచ్చు.
Foldable iPhone is here! 🤯
via https://t.co/rqqgkeGC7X pic.twitter.com/a7QTlsFgSz
— Ben Geskin (@BenGeskin) November 8, 2022
అన్నేళ్లు ఎలా ఆగుతామండి బాబా అని ఒక చైనీస్ టెకీ మడతపెట్టే ఐఫోన్ ని సృష్టించేశాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ గా సంచలనం సృష్టించింది. చైనా యూట్యూబర్ ఒకరు తన పాత ఐఫోన్ 13 ఫోన్ ని ఫోల్డబుల్ ఐఫోన్ గా మార్చేశాడు. దానికి ఐఫోన్ 5 అనే పేరు కూడా పెట్టేశాడు. ఈ ఫోన్ అచ్చం సామ్ సంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 లానే ఉంటుంది. మోటోరోలా రేజర్ 2020 మోడల్ ఫ్లిప్ ఫోన్ లో ఐఫోన్ భాగాలను ఫిక్స్ చేసి ఫోల్డబుల్ ఫోన్ ని తయారుచేశాడు. ఈ ఫోల్డబుల్ ఫోన్ ని తయారుచేసేందుకు, ముఖ్యంగా డిస్ప్లే పనిచేసేందుకు ఆ చైనా మనిషికి ఏడాదికి పైగా సమయం పట్టిందట. అన్ని నెలల నిరంతర శ్రమ తర్వాత ఫైనల్ గా ప్రపంచపు తొలి ఫోల్డబుల్ ఐ ఫోన్ సృష్టించబడింది. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ని ఎలా తయారుచేశాడో ఒక వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు చైనా యూట్యూబర్. ఈ వీడియోలో ఐఫోన్ ని ఫోల్డబుల్ ఐఫోన్ గా కన్వర్ట్ చేసిన విధానాన్ని వివరిస్తూ వచ్చాడు.