ఇప్పుడు, గర్భనిరోధక మాత్రలు, పరికరాలు ప్రపంచం మొత్తంలో విచ్చల విడిగా అమ్ముడు పోతున్నాయి. ప్రపంచం మొత్తంలోని అనేక మంది జంటలు పిల్లలు పుట్టకుండా ఓరల్ పిల్స్, కండోమ్స్, వీర్యకణాలను నాశనం చేసే జెల్ వంటి వివిధ రకాల గర్భనిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మగవారికి గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రావటానికి ఓ ప్రముఖ వ్యక్తి సహాయరం అందిస్తున్నారు. అయన మరెవరో కాదు – ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ మగవాళ్ల సంతాన నిరోధక మాత్రల తయారీ నడుస్తోంది.
బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి 1.7 మిలియన్ డాలర్ల సాయం అందించారు బిల్ గేట్స్. ఈ మగవారి గర్భనిరోధక మాత్రలు ఆడవాళ్లలో అండాల తయారీని గర్భనిరోధక మాత్రలు ఎలా అడ్డుకుంటాయో మగవాళ్లలోనూ వీర్యకణాల తయారీని నిలిపివేస్తాయన్నమాట. స్కాట్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ డుండీ ఈ మాత్రలకు సంబంధించి ప్రయోగాలు చేస్తోంది. గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతుండగా ఈ ప్రయోగాల్లో డుండీ మొదటి అడుగు వేసింది.
కేవలం శారీరక సుఖం కోసం కలయిక కోరుకునే జంటల కోసం ఈ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తేనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ డుండీ – స్కాట్లాండ్ – ప్రకటించింది. ఈ మేరకు గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతుండగా ఈ ప్రయోగాల్లో డుండీ మొదటి అడుగు వేసింది. వీలైనంత త్వరగా మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.