గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తన బేబీ బంప్ ఫొటోలను ఇల్లూ బేబీ షేర్ చేశారు. ఈసారి తనకు పుట్టబోయే బిడ్డ ఎవరనేది ఆమె క్లారిటీ ఇచ్చేశారు.
ఇలియానా.. ఈ పేరు తెలియని టాలీవుడ్ మూవీ లవర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. అదిరిపోయే అందం, అద్భుతమైన నటనతో కోట్ల మంది ఆడియెన్స్ హృదయాలను దోచుకున్నారు ఇలియానా. ‘పోకిరి’, ‘కిక్’, ‘జులాయి’ లాంటి సూపర్ హిట్స్‌తో యూత్ హార్ట్‌త్రోబ్‌గా మారిపోయారు ఇల్లూ బేబీ. అయితే ఆ తర్వాత వరుస పరాజయాలు పలకరించడంతో ఆమె టాలీవుడ్‌కు దూరమయ్యారు. బాలీవుడ్లో ‘బర్ఫీ’ లాంటి ఒకట్రెండు హిట్ మూవీస్‌లో నటించినప్పటికీ.. ఎందుకో అక్కడ ఆమెకు ఏదీ కలసిరాలేదు. అలాంటి ఇలియానా ఇటీవల ఒక న్యూస్‌తో తన ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశారు. తాను ప్రెగ్నెంట్ అంటూ బాంబు పేల్చారు ఇలియానా. దీంతో ఆమె టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ ఏంటని కొందరు ఆమెను విమర్శించారు.
నీ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అంటూ మరికొందరు ఇలియానాను ప్రశ్నించారు. ఇంకొందరు నీ పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలంటూ నిలదీశారు. అయితే ఈ విమర్శలు, ట్రోలింగ్‌ను ఆమె పట్టించుకోవడం లేదు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను మరోమారు అభిమానులతో పంచుకున్నారు ఇలియానా. ఇటీవల కారులో వెళ్తున్న ఒక వీడియోను షేర్ చేసిన ఆమె.. దీనికి ‘సన్ అవుట్, బంప్స్ అవుట్’ అంటూ క్యాప్షన్ జతచేశారు. తాజాగా మరోసారి బేబీ బంప్ ఫొటోలను పంచుకున్నారు. ‘ఏంజెల్’ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చారు ఇల్లూ బేబీ. దీంతో తనకు పుట్టబోయేది ఆడబిడ్డేనంటూ ఆమె హింట్ ఇచ్చినట్లయింది. మరి.. తనకు పుట్టబోయే బిడ్డ గురించి ముందే చెప్పేస్తూ ఇల్లూ బేబీ పోస్ట్ పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.