ప్రముఖ హీరోయిన్ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు ఆమె తెలిపారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..!
మన దేశ బడా చిత్ర పరిశ్రమల్లో బాలీవుడ్ కూడా ఒకటి. ఇప్పుడంటే తెలుగు, కన్నడ సినిమాలు పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. కానీ నిన్న మొన్నటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ అనేలా ఉండేది. హిందీ హీరోలు, హీరోయిన్లు.. ఇండియన్ ఫిలిం స్టార్లుగా కీర్తించబడేవారు. అయితే దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘బాహుబలి’తో మొత్తం కథ మారిపోయింది. దమ్మున్న కంటెంట్ ఉన్న చిత్రాలు దేశవ్యాప్తంగా ఎక్కడ రిలీజ్ చేసినా సక్సెస్ అవుతాయని ప్రూవ్ అయింది. దీంతో ఉత్తరాది మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని సౌత్ నుంచి చాలా సినిమాలు బాలీవుడ్లో రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. బాలీవుడ్లో సెటిల్ అవ్వడం అంత ఈజీ కాదు.
విపరీతమైన పోటీ ఉండే హిందీ చిత్ర పరిశ్రమలో నెగ్గుకురావడం చాలా కష్టమని సినీ విశ్లేషకులు అంటుంటారు. అలాంటి బాలీవుడ్లో నటిగా తానేంటో నిరూపించుకున్నారు హీరోయిన్ స్వర భాస్కర్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా నటిగా ఒక్కో సినిమాతో స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. అదిరిపోయే అందం, చక్కటి అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. అయితే ఈమధ్య సినిమాల కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి స్వర భాస్కర్ తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఆమె త్వరలో తల్లి కాబోతున్నారు. ప్రెగ్నెన్సీ గురించి చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు స్వర. కుటుంబంలో కొత్త వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఆమె బేబీ బంప్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరి 16న సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ జిరార్ అహ్మద్‌ను స్వర భాస్కర్ పెళ్లాడిన విషయం తెలిసిందే.