ప్రముఖ బాలీవుడ్ నటుడు మరోసారి తండ్రి కాబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆయనకు కంగ్రాట్స్ అంటూ విషెస్ చెబుతున్నారు.
చిత్ర పరిశ్రమలోకి ఎందరో నటులు వస్తుంటారు, పోతుంటారు. అయితే కొందరు మాత్రమే ఇక్కడ నిలదొక్కుకుంటారు. ఎప్పటికప్పుడు ప్రతిభకు సానబెడుతూ, ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా తమను తాము మార్చుకునేవారు మాత్రమే ఎక్కువ కాలం ఉండగలరు. అలా స్థిరపడిన నటులకే పర్మినెంట్ క్రేజ్ ఉంటుంది. అలాంటి పాపులారిటీ ఉన్న నటుల్లో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ఒకరని కచ్చితంగా చెప్పొచ్చు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారాయన. ఫ్లాపులు ఎదురైనా, సరైన పాత్రలు రాకపోయినా ఇండస్ట్రీని వీడలేదు. నచ్చిన పాత్రలు వచ్చేంత వరకు ఎదురు చూశారు. అలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు చెలరేగి యాక్టింగ్ చేశారు. హిందీ సినీ పరిశ్రమలో విలక్షణమైన నటుల్లో అర్జున్ రాంపాల్ ఒకరు.
డాన్, రాక్ ఆన్, డీ-డే లాంటి చిత్రాల ద్వారా అర్జున్ రాంపాల్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. అలాంటి ఆయన మరోసారి తండ్రి కాబోతున్నారు. చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న అర్జున్ రాంపాల్-మోడల్ గార్బెల్లాలు రెండోసారి పేరెంట్స్ కాబోతున్నారు. తన బేబీ బంప్ ఫొటోలను గార్బెల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో స్టార్ హీరోయిన్లు కాజల్, అమీ జాక్సన్ తదితరులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, అర్జున్ రాంపాల్ 1998లో మెహర్‌ను పెళ్లాడగా.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. అనంతరం గార్బెల్లాతో సహజీవనం చేస్తున్నట్లు అర్జున్ రాంపాల్ ప్రకటించారు. వీళ్లిద్దరికి ఇప్పటికే ఒక బాబు జన్మించాడు.
#ArjunRampal‘s girlfriend #GabriellaDemetriades announces second pregnancy
Read: https://t.co/MDH4LeUO3s pic.twitter.com/eb52k3mdpc
— IANS (@ians_india) April 29, 2023