పెళ్లి, ప్రెగ్నెన్సీపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకోవాలంటే ముందు ప్రెగ్నెంట్ అవ్వాలి అన్నట్టు కామెంట్స్ చేసింది. అంతేకాదు..
హీరోయిన్ తాప్సీ గురించి సినీ ప్రియులకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్, రవితేజ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్ లో క్రేజ్ తగ్గడంతో ఆమె బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ‘డంకీ’, ‘ఏలియన్’ మూవీస్‌తో బిజీగా ఉన్న తాప్సీ తాజాగా ఇన్‌స్టా వేదికగా చిట్ చాట్ నిర్వహించింది. ఈ చిట్ చాట్ తో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఓ ఫ్యాషన్ షోలో లక్ష్మీ దేవి లాకెట్ వేసుకుని అభ్యంతరకర దుస్తుల్లో కనిపించిన తాప్సీపై అప్పట్లో కేసు కూడా పెట్టారు. ఈ ఘటనతో వివాదంలో ఇరుక్కున్న తాప్సీ ఎలాగోలా బయటపడింది. తాజాగా మరొక వివాదంలో ఇరుక్కుంది.
పెళ్లి, ప్రెగ్నెన్సీపై కామెంట్స్ చేస్తూ బాలీవుడ్ కపుల్స్ పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేసింది. తాజాగా ఇన్ స్టాలో నెటిజన్స్‌తో కాసేపు చిట్ చాట్ చేసింది. ఇందులో ఒక నెటిజన్ ‘మీ పెళ్లి ఎప్పుడు’? అని అడిగాడు. దీనికి తాప్సీ ‘నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు, వెంటనే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు’ అంటూ ఫన్నీగా సమాధానమిచ్చింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలంటే ముందు ప్రెగ్నెంట్ అవ్వాలా? మాకు తెలియదులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాప్సీ పెళ్లి చేసుకోవాలంటే ముందు ప్రెగ్నెంట్ అవుతుందా ఏంటి అని సెటైర్లు విసురుతున్నారు. మరోవైపు తాప్సీ చేసిన కామెంట్స్ బాలీవుడ్ ప్రేమ జంట అయిన ఆలియా, రణ్‌బీర్ కపూర్ ని ఉద్దేశించినవే అంటూ ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ఈ జంట ఏప్రిల్ 14న పెళ్లి చేసుకుంది. పెళ్ళైన ఆరు నెలలకే అలియా భట్ ప్రెగ్నెంట్ అయ్యింది. 2022 నవంబర్ 2న బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తాప్సీ వీళ్ళని ఉద్దేశించే కామెంట్స్ చేసిందని అంటున్నారు. మరి పెళ్లి, ప్రెగ్నెన్సీపై తాప్సీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.