చూసేందుకు నమ్మశక్యంగా లేని రూపంలో పుట్టిన బిడ్డ.. జన్యులోపంతో పిల్లలు పుడుతున్నారనే సాకుతో నిర్దాక్షన్యంగా వదిలేసిన భర్త, ఊరి నుంచి వెలేసిన గ్రామస్తులు, ఏలియన్, డేవిల్ కిడ్ అంటూ హేళనలు, చంపేయాలని బంధువుల అడ్డమైన సలహాలు ఆ తల్లిని బిడ్డ నుంచి దూరం చేయలేకపోయాయి. కొడుకెలా ఉన్నా తల్లి రాజే అన్నట్లు వింత రూపంతో పుట్టిన ఆ బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటుందా తల్లి. రవాండ్‌లో బ్యాడ్ జెన్సీ లిబరేట్ అనే మహిళకు జన్యులోపాలతో పిల్లలు పుట్టేవారు.
అందులో చివరి వాడు ఈ బాలుడు ఇతను నమ్మశక్యం కానీ త్రిభుజాకార తలతో జన్మించాడు. దాంతో లిబరేట్‌కు భర్త విడాకులిచ్చాడు. బంధువులు ఆ పిల్లాడిని చంపేయాలని ఉచిత సలహాలు ఇచ్చారు. గ్రామస్తులు ఏలియన్, డెవిల్ సన్ అంటూ హేళను చేసి వెలివేశారు. దాంతో ఆ తల్లి వేరే ఊరికి మారాల్సి వచ్చింది. ఆమె ఉద్యోగం కూడా వదులుకుంది. ఈ క్రమంలో ‘గో ఫండ్ మీ’ అనే చారిటీ సంస్థ ఆ శిశువుకు అమెరికాలో వైద్యం చేయిస్తున్నారు. ఎన్ని కష్టాలు , అవమానాలు ఎదురైనా బిడ్డను కంటికి రెప్పాల కాచుకున్న ఆ తల్లికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంతనై తల్లి ప్రేమకు మించి ఏది ఉండదని కామెంట్లు చేస్తున్నారు.