ఇతడు ఓ స్కూల్ లో సంగీత టీచర్ గా పని చేస్తున్నాడు. కొంత కాలం పాటు అదే స్కూల్ లో పని చేసిన ఆ టీచర్ ఏడాది కిందట ఒక్కసారిగా కనిపించకుండపోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. ఎంత వెతికినా అతని ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక ఆ టీచర్ కుటుంబ సభ్యులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం గాలించారు. కట్ చేస్తే తాజాగా ఈ మిస్సింగ్ కేసులో వెలుగులోకి వచ్చిన నిజాలు తెలుసుకుని పోలీసులు ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్ట్రేలియన్ కు చెందిన మార్క్ సియోవారెల్లా (57) ఆఫ్రికా దేశంలో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఇంగ్లీష్, సంగీత టీచర్ గా పని చేశాడు. అక్కడే కొంత కాలం పాటు పని చేసిన సియోవారెల్లా ఆ తర్వాత ఫ్రెంచ్ కాన్సులర్ స్కూల్ కు మరాడు. ఇదిలా ఉంటే కాంగాలోని బ్రజ్జావేలిలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటూ స్కూల్ కు వెళ్లేవాడు. అయితే ఇటీవల సియోవారెల్లా ఉన్న అపార్ట్ మెంట్ కు అతని సహచరుడు, క్లాస్ మెట్స్ ఇద్దరు వచ్చారు. వారు రావడంతో ముగ్గురు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు.
ఈ క్రమంలోనే సియోవారెల్లా వాష్ రూమ్ కు వెళ్లాడు. దీంతో వెంటనే ఆ టీచర్ రూమ్ మెట్స్ వచ్చి.. తొందరలో సియోవారెల్లా ఆస్ట్రేలియాకు వెళ్లిపోతున్నాడని తెలిపాడు. దీంతో అతని ఇద్దరు స్నేహితులు షాక్ కు గురయ్యారు. ఇతని వెళ్లిపోతే ఎలా? ఇప్పుడు ఏం చేద్దామని అనుకున్నారు. చేసేదేం లేదు.. సియోవారెల్లాను చంపి, అతని వద్ద ఉన్న డబ్బులు తీసుకుందామని అనుకున్నారు. దీంతో వెంటనే అక్కడున్న గ్లాసులో పాయిజన్ వేసి కలిపి అక్కడ ఉంచారు. ఇక వాష్ రూమ్ నుంచి వచ్చిన సియోవారెల్లా వారు కలిపిన పాయిజన్ వాటర్ తాగాడు.
ఇది తాగిన వెంటనే ఆ టీచర్ స్పృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత అతని క్లాస్ మెట్స్, సహచరుడు ఇద్దరు కలిసి అతని వద్ద ఉన్న క్రెడిట్ కార్డుల, డబ్బులు దోచుకున్నారు. అనంతరం సియోవారెల్లా మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ఓ నదిలో పడేశారు. ఇదంతా గతేడాది జరిగింది. అయితే అప్పటి నుంచి సియోవారెల్లా కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్ని రోజులు విచారించగా.. తాజాగా సియోవారెల్లాని అతడి స్నేహితులే చంపి నదిలో పడేశారని తెలుసుకున్నారు. అసలు నిజాలు తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.