ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ప్రపంచం ఏం భయపడిందో ప్రస్తుతం అదే జరుగుతోంది. ఆఫ్ఘాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న నాటి నుంచి తాలిబన్లు అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. ప్రతి విషయంలోనూ దారుణమైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇక ఇక్కడి మహిళల పరిస్థితి అయితే రోజూ రోజుకు దారుణంగా మారిపోతుంది. వారు అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఆశలతో విద్యాలయాల్లోకి వెళ్లిన యువతలు పై తాలిబన్లు కొత్త ఆంక్షలు విధించారు. మహిళా విద్యార్ధులు యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించకుండా తాలిబాన్లు నిషేధం విధించారు. తాలిబన్ పాలకులు తీసుకున్న ఈ నిర్ణయంపై యువతులు, విద్యార్థినులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఈ నిర్ణయం కంటే తమ తలలు నరకండి అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అష్రఫ్ ఘనీ నేతృత్వంలో కొనసాగుతున్న ఆఫ్ఘాన్ ప్రభుత్వాన్ని 2021 ఆగష్టులో తాలిబాన్లు కూల్చేరు. తాలిబాన్లు అధికారంలోకి రాగానే అప్పటి వరకు ఎంతో స్వేచ్చగా ఉన్న మహిళలపై ఆంక్షలు విధించారు. మహిళలు పనులు చేయకుండా, చదువుకోకుండా నిషేధాన్ని విధించారు. కేవలం వంటిళ్లకే పరిమితం అయ్యేలా తీవ్ర ఆంక్షలు పెట్టారు. ఇంకా దారుణం ఏమిటంటే.. మహిళళు మార్కెట్ కి వెళ్లాలంటే ఇంట్లోని మగవారిని తోడు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల అక్కడి విద్యార్థినిల విషయంలో తాలిబాన్లు మరో నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సీటీల్లోకి విద్యార్థిని వెళ్లడాన్ని నిషేధిస్తూ తాలిబాన్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే తాలిబాన్లు తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. యూనివర్సిటీల్లోకి మహిళలకు నిషేధం విధించడంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి నిర్ణయాలు కన్నా తమ తల తీసేయడం ఉత్తమంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్ పాలకులు నిర్ణయాలు అక్కడి మహిళలను మరోసారి పాత కాలంలోకి తీసుకెళ్తున్నాయని ఆరోపించారు. ఇంతకంటే పుట్టకుండా ఉండటమే ఉత్తమమని విద్యార్థినిలు వాపోయారు. మహిళ విద్యార్థులపై బహిష్కరణ తొలగించే వరకు తాము కూడా తరగతులకు హాజరకుకామని విద్యార్ధులు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాల్సిందిగా కాబూల్ విశ్వవిద్యాలయంలో అనేక మంది లెక్చలర్లు.. తాలిబాన్లను కోరారు. అయితే తాలిబాన్లు తీసుకుంటున్నా ఈ నిర్ణయాలపై దేశ, విదేశాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి.. మహిళపై తాలిబాన్లు విధిస్తున్నా ఆంక్షలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.