ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ప్రపంచం ఏం భయపడిందో ప్రస్తుతం అదే జరుగుతోంది. ఆఫ్ఘాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న నాటి నుంచి తాలిబన్లు అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. ప్రతి విషయంలోనూ దారుణమైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇక ఇక్కడి మహిళల పరిస్థితి అయితే రోజూ రోజుకు దారుణంగా మారిపోతుంది. వారు అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఆశలతో విద్యాలయాల్లోకి వెళ్లిన యువతలు పై తాలిబన్లు కొత్త ఆంక్షలు విధించారు. మహిళా విద్యార్ధులు యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించకుండా […]
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలన నడుస్తున్న విషయం తెలిసిందే. మత విశ్వాసాల ఆధారంగా పాలన సాగిస్తూ తాలిబన్లు.. కఠినమైన, వివక్షపూరితమైన నిర్ణయాలను బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారు. అమెరికా సైన్యాలను ఎదిరించి, అఫ్ఘానిస్థాన్‌లోని ప్రభుత్వాన్ని కూల్చేసి.. పాలనను హస్తగతం చేస్తున్న తాలిబన్లు అరాచక పాలనతో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా పలు కఠిన ఆంక్షలు విధించిన తాలిబన్లు.. తాజాగా యునివర్సిటీల్లో మహిళలు విద్య అభ్యసించడాన్ని నిషేధించారు. గతంలో బాలికలను ప్రాథమిక, హైస్కూల్ విద్యకు దూరం చేసిన తాలిబన్లు.. మహిళలు […]
ఇటీవల అఫ్ఘనిస్తాన్ ని తాలీబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సామాన్యులే కాదు ఉన్న హూదాలో ఉన్నవారు కూడా పలు కష్టాలు పడ్డారు. ప్రపంచంలో ఎవరికైనా ఎంత టాలెంట్ ఉన్నా.. కాలం అనేది కలిసి రాకపోతే ఇబ్బందులు పడాల్సిందే. ఒకప్పుడు మంచి యాంకర్ గా రాణించి.. న్యూస్ రీడర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న వ్యక్తి ప్రస్తుతం రోడ్లపై బ్రెడ్డు, సమోసాలు అమ్ముకునే పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి […]
తుపాకులను నమ్ముకుని.. ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి.. ప్రజలను భయపెట్టి అఫ్గానిస్తాన్ గద్దెనెక్కారు తాలిబన్లు. ఇష్టం వచ్చినట్లు పాలన వ్యవహారాలను మార్చేసి.. అడ్డగోలుగా నిబంధనలు విధించారు. దీంతో పాలన గాడి తప్పింది.. జనజీవనం అస్తవ్యస్తమైంది. మెల్లమెల్లగా దేశంలో ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుంది. దేశప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్న తరుణంలో తాలిబన్ల కళ్లు తెరుచుకున్నట్లున్నాయి. దేశాన్ని పాలించడం అంటే తుపాలను పేల్చినంత సులువు కాదని విషయం బోధపడి ఉంటుంది. దీంతో తమ పంతాన్ని వదిలి తాలిబన్ ప్రభుత్వం దిగొచ్చింది. […]
న్యూజిలాండ్, ఇంగ్లండ్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ బాగా హర్ట్ అయింది. టీ20 వరల్డ్ కప్‌లో ప్రతీకారం తీర్చుకుంటాం అనే దాకా వెళ్లిందంటే వాళ్లు ఎంత అవమానంగా భావించారో అర్థం అవుతుంది. పాకిస్తాన్‌తో పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశం కూడా ముందుకు రావడం లేదు. ఇంతకు ముందు న్యూజిలాండ్ ఆ దేశానికి వచ్చి, భద్రతా కారణాల దృష్ట్య మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు సిరీస్‌ను రద్దు చేసుకుని వెళ్లిపోయింది. దాంతో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. […]
స్టేడియంలో అమ్మాయిలు డాన్సులేస్తున్నారని, మహిళా ప్రేక్షకులు హాజరువుతున్నారనే కారణంతో ఆఫ్ఘనిస్తాన్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారాలను తాలిబన్లు నిషేధించారు. దేశంలోని వివిధ చానెల్ ల బ్రాడ్‌కాస్ట్‌లను ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు తాలిబన్లను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇప్పటికే మహిళలు స్పోర్ట్స్’లో పాల్గొనడంపై నిషేధం విధించిన తాలిబన్లు, పురుషులు క్రికెట్ ఆడేందుకు మాత్రం అనుమతించారు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, […]
ఆఫ్ఘానిస్తాన్ కి తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్న తాలిబన్లు ఇప్పుడు తమ నిజస్వరూపాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మొదట తాము శాంతియుతంగా ఉంటామని.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తీసుకు రాబోమని అన్నారు. కానీ ఆఫ్ఘన్ లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత వారి హింసాకాండ మళ్లీ మొదలు పెట్టారు. అసలు తాలిబన్లు అంటేనే హింసావాలులు.. క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్ అంటారు. ప్రతి చిన్న విషయానికి వారు తుపాకులే వాడుతుంటారు.. వారికి ఎదురు తిరిగిన వాళ్లను దారుణంగా […]
ఈ నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని భేటీ కానున్నారు. కాగా ఈ సమావేశంలో ప్రధానంగా అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలనపై చర్చించనున్నట్టు సమాచారం. అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీతో ఆయనకు ఇదే మొదటి భేటి.అఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత స్థితిగతులు, కోవిడ్19, క్లైమెట్ చెంజ్, టెర్రరిజం అంశాల చర్చకు రానున్నాయి. ప్రధాని విదేశీ టూర్ షెడ్యూలింగ్ టీం ఈ నెల 9న అమెరికాకు వెళ్లనుంది. 23న ప్రధాని మోదీ […]
ఆఫ్ఘానిస్తాన్ తమ వశమైపోయినట్టేనని సంబరపడిపోతున్న తాలిబన్లకు గత కొంత కాలంగా కొరకరాని కొయ్యగా ‘పంజషేర్’ నుంచి తిరుగుబాటు మొదలైంది. కాబూల్ ని ఆక్రమించుకున్న తాలిబన్లు ఆఫ్ఘన్ పూర్తిగా ఆక్రమించుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇక్కడే వాళ్లకు అనూహ్యరీతిలో షాక్ తగిలింది. పంజ్ షేర్ నుంచి తాలిబన్లకు పూర్తి వ్యతిరేకత ఎదురైంది. నాటి నుంచి ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లకు, షంజ్ షేర్ యోధులకు మధ్య భీకరపోరు నడుస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. విజయమో.. వీరమరణామో అన్న రీతిలో షంజ్ షేర్ […]
అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు రోజుకొక నిర్ణయంతో సంచలనంగా మారుతున్నారు. గతంలో కాబూల్ మినహా దేశం మొత్తాన్ని ఆక్రమించుకుని అఫ్ఘాన్ దేశ ప్రజలకు చుక్కలు చూపించారు. ఇక ఇటీవల కాబూల్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవటంతో వారికి మరింత శక్తి లభించినట్లైంది. దీంతో తాజాగా తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ మీడియాతో మాట్లాడుతూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ తో పాటు ముస్లీంలు మరే ప్రాంతంలో ఉన్నవారి హక్కుల గురుంచి మేము పాటుపడతామని సుహైల్ షహీన్ తెలిపారు. మీ […]