అమ్మ అంటే ఆప్యాయత.. అనుబంధం… అమ్మ ఒక మార్గదర్శి.. ఒక స్ఫూర్తి, అమ్మే తొలి గురువు. అమ్మకన్నా గొప్ప దైవం ఎక్కడా ఉండదు.. అమ్మ లేకపోతే ఆ లోటు జీవితంలో ఎవరూ తీర్చలేరు. తన బదులుగా దేవుడు అమ్మను సృష్టించాడని అంటారు. ఏ తల్లి అయినా.. తన పిల్లలు సంతోషంగా ఉంటే చాలనుకుంటుంది. వారిలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఆ తల్లి కూడా అదే చేసింది. తాను చనిపోతానని తెలిసి.. తన కొడుకు గ్రాడ్యుయేట్‌గా చూడాలి అనుకుంది.. ఆ తల్లి కోరిక తెలుసుకున్న తనయుడు ఆమె కోసం పడ్డ ఆరాటానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కన్నీరు తెప్పిస్తున్న ఆ కథ ఏంటో చూద్దాం..
మనిషి విధి రాత నుంచి ఎప్పుడూ తప్పించుకోలేడు. మనకు ఇష్టమైన వాళ్లు మన ముందు ఎంతో సంతోషంగా గడిపిన వాళ్లు.. మన మద్యలో ఇక ఉండరు అని తెలిస్తే.. వారి రూపం ఇక చూడలేమని తెలిస్తే.. ఆ క్షణం మనలో అగ్నిపర్వతం బద్ధలవుతుంది. ఓ తల్లి తన కొడుకు ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఎంతో ఆరాటపడుతుండేది.. కానీ విధి ఆ తల్లి జీవితంతో క్యాన్సర్ రూపంలో ఆడుకుంది. ఆ తల్లి చివరి కోరిక ఒకటే… తన కొడుకును గ్రాడ్యుయేట్‌గా చూడాలి అనుకుంది. ఆ అనుభవాన్ని స్వయంగా పొందాలి అనుకుంది. ఇక తన తల్లి త్వరలో చనిపోతుందని తెలుసుకున్న కొడుకు.. తల్లి కోసం ఏదైనా చెయ్యాలి భావించాడు. తల్లి కోసం కొడుకు పడ్డ ఆరాటం చూస్తే ఎంతటి కఠిన హృదయులు కూడా కరిగిపోతారు. అతని కథ చూస్తే.. ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తోంది.
ఈ హృదయవిదారకమైన స్టోరీని ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని జూన్ 26, 2022న షేర్ చేశారు. స్టెఫానీ నార్త్‌కాట్ అనే మహిళకు రెండు సంవత్సరాల క్రితం క్యాన్సర్ భారిన పడింది. తన తల్లిని కాపాడుకోవడానికి ఎన్నో హిస్పిటల్స్ లో చూపించాడు కొడుకు డాల్టన్. కానీ ఆ కొడుకు ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి. అయితే తల్లి చివరి కోరిక తెలుసుకున్న తనయుడు ఆమె తృప్తి కోసం తన స్నేహితులను, ఫ్యామిలీ, స్కూల్ టీచర్లు అందర్నీ ఆస్పత్రికి తీసుకొచ్చి… ఓ గ్రాడ్యుయేషన్ సెరెమనీని నిర్వహించాడు. అందరూ చూస్తుండగా… గ్రాడ్యుయేషన్ పొందినట్లు చేశాడు. ఆ దృశ్యం చూసి తల్లి ఎంతో సంతోషించింది.
ఇక తల్లి కళ్లలో ఆనందాన్ని చూసి కొడుకు కూడా ఎంతగానో ఆనందించాడు. కాగా, ఈ సెరెమనీ జరిగిన వారం తర్వాత ఆమె చనిపోయింది. ఈ వీడియోని ఇప్పటికే 92 వేల మందికి పైగా చూడగా… 4.7 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ హృదయవిదారకమైన పోస్ట్ చూసి నెటిజన్లు ఎంతగానో ఆవేదన చెంతుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ తల్లి కొడుకు అనుబంధంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This MOTHER had just one FINAL WISH. pic.twitter.com/PVA9tK2X0p
— Awanish Sharan (@AwanishSharan) June 26, 2022