రోడ్డు పై కనిపించే యాచకులు ఎంతో దీనమైన స్థితిలో కనిపిస్తుంటారు. ఎవరైనా దానం చేస్తే ఆ పూట గడుస్తుంది. అయితే కొన్నిసార్లు బిచ్చగాళ్లు ఇంగ్లీష్ మాట్లాడుతూ చూపరులను ఆశ్చపరుస్తుంటారు.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పుట్టించే విధంగా ఉంటే.. మరికొన్ని కన్నీరు తెప్పించే విధంగా ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఒక్కసారే ఫేమస్ అవుతుంటారు. సాధారణంగా రోడ్డు సైడ్ బిక్షమెత్తుకునే వారు ఎంతో దీన స్థితిలో కనిపిస్తుంటారు. దయగల వారు డబ్బు రూపంలో కానీ, ఆహార రూపంలో కాని ఇస్తే దండం పెట్టి తీసుకుంటారు. కొంతమంది యాచకులు జీవితంలో అన్నీ కోల్పోయి.. గత్యంతరం లేక అలా మారిపోతుంటారు. వారి జీవితాల్లో సంతోషం, దుఖఃం అన్నీ చవిచూసినవారే కావడం విశేషం. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో బిచ్చగాళ్లను చూస్తే ఆశ్చర్యపోయే విధంగా ప్రవర్తిస్తుంటారు. మంచి చదువు చదివి ఇంగ్లీష్ అనర్ఘళంగా మాట్లాడుతుంటారు. తాజాగా హైదరాబాద్ లో ఓ యాచకుడిగా కనిపిస్తున్న వ్యక్తి అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడటమే కాదు.. జీవిత సత్యాలు చెబుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ఒక్క మాట నెట్టింట్ల తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లాకు చెందిన షేక్ అహ్మద్ పాషా చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో షేక్ అహ్మద్ పాషా తన జీవితం ఇలా ఎందుకు అయ్యిందన్న విషయం గురించి తెలిపాడు. హైదరాబాద్ యూసఫ్ గుడాలో జీవనాన్ని గడుపుతున్న పాషా పుట్టింది పెరిగింది వరంగల్ జిల్లా. ఇంటర్ వరకు చదువుకున్న షేక్ అహ్మద్ పాషా ఉద్యోగం రాకపోవడంతో వరంగల్ విడిచి 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ కి వలస వచ్చాడు. ఎర్రగడ్డ, భరత్ నగర్ లో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవితాన్ని గడిపినట్లు తెలిపారు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారని.. ఎవరూ తనని దగ్గరకు తీసుకోకపోవడంతో వారిపై విరక్తి చెంది ఒంటరిగా జీవిస్తున్నాట్లు తెలిపారు. తన జీవితంలో ఎవరికీ భయపడింది లేదని.. తనది ప్రేమ వివాహం అని.. తన భార్య ఎంతో మంచిదని అంటున్నాడు. అప్పుడప్పుడు తన భార్య దగ్గరకు వెళ్తుంటానని అన్నాడు.
ఒకప్పుడు తాను కూడా మంచి జీవితాన్ని గడిపానని.. కానీ కాలం ఎప్పడూ ఒకేలా ఉండదని, మనిషిని ఎలాంటి పరిస్థితికి అయినా తీసుకు వస్తుందని అంటున్నాడు. తల్లిదండ్రులకు మూడు పూటలు కాకున్నా ఒక్కపూటైనా తిండి పెట్టాలని అంటున్నాడు. ఎర్రగడ్డ, భరత్ నగర్ లో కూరగాయల మార్కెట్కి వెళ్తే రెండు వందల వరకు సంపాదిస్తానని.. లేదంటే ఎవరినైనా అడుక్కుంటానని అంటున్నాడు. అలా నా జీవితం గడుస్తుందని అంటున్నాడు. షేక్ అహ్మద్ పాషా ఇంటర్వ్యూ ఇస్తున్నంత సేపు ఇంగ్లీష్ లో అనర్ఘళంగా మాట్లాడుతున్నాడు. ఎంతో అగ్రెసీవ్ గా మాట్లాడుతున్న షేక్ అహ్మద్ పాషా గతంలో తన అత్తగారింటికి వెళ్లినపుడు జరిగిన సంఘటన గురించి కొన్ని బూతు మాటలు కూడా మాట్లాడాడు.. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మొత్తానికి ఒక్క మాటతో ఇప్పుడు ఈ బిక్షగాడు తెగ ఫేమస్ అయ్యాడు. ఓ వైపు నెటిజన్లు సానుభూతి చూపిస్తుంటే.. మరోవైపు ఆయన మాట్లాడిన బూతు మాటలు ప్రస్తుతం విపరీతమైన వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.