ఇక్కడ చాలా మంది టెకీలు ఉద్యోగాలు పోయి రోడ్డున పడుతుంటే ఈ కుర్రాడు మాత్రం పెద్ద కంపెనీలో జాబ్ కొట్టేశాడు. అది కూడా 14 ఏళ్ల వయసులో. ఈ వయసులో గట్టిగా కంప్యూటర్ గురించే తెలియదు 90స్ బ్యాచ్ కి. అలాంటిది ఈ కుర్రాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిపోయాడు.
14 ఏళ్ల వయసు అంటే ఏ ఏడో తరగతో, ఎనిమిదో తరగతో చదివే వయసు. ఆ వయసులో 24 గంటలూ అదే పనిగా చదువుతూ ఉంటారా. ఆటలు, పాటలు ఏవో ఉంటాయిగా. ఫ్రెండ్స్ తో సరదాగా ఆడుకోవడం, ఇంట్లో హోమ్ వర్క్ చెయ్ అంటే బాధపడుతూ చేయడం ఇవే 14 ఏళ్ల వయసులో ఏ కుర్రాడైనా చేసేది. కానీ 14 ఏళ్ళకి ఈ కుర్రాడు మాత్రం ఏకంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ కొట్టేశాడు. అది కూడా ఎలాన్ మస్క్ కి చెందిన ప్రతిష్టాత్మక స్పేస్ ఎక్స్ కంపెనీలో ఉద్యోగం కొట్టాడు. ఈ కంపెనీలో అతి పిన్న వయస్కుడైన ఉద్యోగిగా చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చెందిన కైరన్ క్వాజీనే ఈ ఘనతను సాధించింది.
శాంటాక్లారా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి త్వరలోనే గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్ పొందనున్నాడు. స్పేస్ ఎక్స్ కంపెనీలోని స్టార్ లింక్ బృందంలో త్వరలోనే చేరనున్నానని తన లింక్డిన్ ఖాతాలో వెల్లడించాడు. ఇంటర్వ్యూని పూర్తి చేసుకుని స్టార్ లింక్ ఇంజనీరింగ్ టీమ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేరుతున్నట్లు వెల్లడించాడు. వయసును బట్టే సామర్థ్యం, పరిపక్వత ఉంటాయని భావించే కాలం చెల్లిన సాంప్రదాయానికి స్వస్తి చెప్పి స్పేస్ ఎక్స్ సంస్థ తనకు అవకాశం ఇచ్చిందని పేర్కొన్నాడు. కైరన్ క్వాజీకి కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ వంటి వాటి మీద శిక్షణ పొందిన అనుభవం ఉంది. చిన్న వయసు నుంచే కొన్ని ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఇంటర్న్ షిప్ చేయడం వల్ల అత్యాధునిక సాంకేతికతలపై అవగాహన ఏర్పడింది.
తొమ్మిదేళ్ల వయసులో లాస్ పోసిటాస్ కమ్యూనిటీ కళాశాలలో చేరి అసోసియేట్ ఆఫ్ సైన్స్ లో అత్యున్నతర గ్రేడ్ తో పాసయ్యాడు. ఇంటెల్ ల్యాబ్స్ లో డైరెక్టర్ ఆఫ్ ఇంటిలిజెన్స్ సిస్టమ్స్ రీసెర్చ్ ల్యాబ్ డైరెక్టర్ లామా నచ్ మన్ తో కలిసి పని చేయడమే క్వాజీ కెరీర్ ని మలుపు తిప్పిందని అన్నాడు. ఆ సమయంలో జనరేటివ్ ఏఐగా పని చేశాడు. అయితే 14 ఏళ్ల వయసులో క్వాజీ ఈ ఘనత సాధించడానికి బీజం రెండేళ్ల వయసులోనే పడింది. రెండేళ్లకే క్వాజీ స్పష్టంగా మాట్లాడేవాడిని తల్లిదండ్రులు చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మూడో తరగతికి వచ్చేసరికి క్వాజీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన టీచర్లు.. సాధారణ విద్య సరిపోదని అన్నారట.
ఆ తర్వాత తనలో ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచకుంటూ ఇవాళ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన కంపెనీలో ఉద్యోగం కొట్టాడు. ఇక స్థానిక వెబ్ సైట్ కథనం ప్రకారం కైరన్ క్వాజీ జీతం రూ. కోటి పైనే ఉంటుందట. స్పేస్ ఎక్స్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఇచ్చే యావరేజ్ జీతం ఏడాదికి రూ. 1,29,507 డాలర్లు ఉంటుందట. మన కరెన్సీ ప్రకారం రూ. 1,06,67,685.85 జీతం. మరి 14 ఏళ్లకే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం పొందిన కైరన్ క్వాజీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.