స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 250 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 270 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,650.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,710.
1కిలో వెండి 74,100
బిజినెస్ డెస్క్- ఈ రోజు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 25 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 27 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు పెరిగి 44 వేల 650 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 270 రూపాయలు పెరిగి 48 వేల 710 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండి 1100 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 74 వేల 100 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 540 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 600 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 150 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49 వేల 250 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,760 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,760 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,560 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,560 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.