సీఎం కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కాకపుట్టిస్తున్నాయి. నిన్నటి నుంచి టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మోదీ.. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహారాష్ట్ర, హర్యానా వంటి ఎన్నో రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతో బీజేపీ పెత్తు పెట్టుకుందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అమిత్‌షా కొడుకు గురుంచి ఎక్కువుగా తెరమీదకు తెస్తున్నారు. క్రికెట్ అంటేనే తెలియని జయ్ షా.. బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడని టీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, బాల్క సుమన్ ప్రశ్నిస్తున్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి.. బీసీసీఐ. ప్రపంచ క్రికెట్ ను శాసించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయి దీనికి. అలాగే- రిచ్చెస్ట్ బోర్డు కూడా. మ్యాచ్ లను ప్రసారం చేసే హక్కులను విక్రయించటం ద్వారా ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని కళ్ల చూస్తోంది బీసీసీఐ. అలాంటి బీసీసీఐ బోర్డులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జయ్ షా కీలక బాధ్యతలు చేపట్టాడు. ఇదే ఇప్పుడు వివాదస్పదంగా మారుతోంది. క్రికెట్ కు ఏమాత్రం సంబంధం లేని.. జయ్ షా బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడంటూ తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.జయ్ షా ఒక్కడినే కాదు.. బీసీసీఐ కోశాధికారిగా అరుణ్ ధుమల్ నియామకంపై కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. సౌరబ్ గంగూలీ చేతికి బీసీసీఐ పగ్గాలను అప్పగించడంపై ఎలాంటి వ్యతిరేకత ఎదురు కాలేదు. అనేక టెస్టులు, వన్డే మ్యాచ్ లను ఆడిన అనుభవం ఉన్న క్రికెటర్ కావడంతో.. సమర్థుడినే నియమించారనే ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే.. క్రికెటర్ గా అంత అనుభవం ఉన్న గంగూలీ.. వీరిద్దరి నియామకంపై ఎందుకు వ్యతిరేకించకలేదనే విమర్శలూ వచ్చాయి. క్రీడారంగంలో రాజకీయాలను జొప్పించే ప్రయత్నానికి బీజేపీ వారిద్దరి నియామకాల ద్వారా తెర తీసిందంటూ టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. జయ్ షా, అరుణ్ ధుమల్ ల నియమాకాలు దేశ క్రీడా రంగానికి ఎలాంటి సంకేతాలను ఇస్తోందంటూ విమర్శిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sania Mirza: జిమ్‌లో కఠిన వర్కౌట్స్‌తో కుస్తీ పడుతున్న సానియా మీర్జా! వీడియో వైరల్!