ప్రస్తుత రోజుల్లో ఆన్ లైమోసాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ చిన్న తప్పు చేసినా భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అయితే ఇలాంటి చిన్న తప్పే చేసింది ఓ యువతి. ఆ తప్పు మూలంగా ఆమె ఏకంగా రూ. 10 లక్షల రూపాయాలను పోగొట్టుకుంది.
నేటి ప్రపంచం టెక్నాలజీలో దూసుకెళ్తోంది. రోజుకో కొత్త ఆవిష్కరణలను ప్రపంచం మనకు పరిచయం చేస్తూ వస్తోంది. ఇక ప్రస్తుత రోజుల్లో ఆన్ లైన్ మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ చిన్న తప్పు చేసినా భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అయితే ఇలాంటి చిన్న తప్పే చేసింది ఓ యువతి. ఆ తప్పు మూలంగా ఆమె ఏకంగా రూ. 10 లక్షల రూపాయాలను పోగొట్టుకుంది. ఇక ఆ మహిళ చేసిన చిన్న తప్పు ఏంటో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఇంతకి ఆ యువతి చేసిన తప్పు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాను ప్రియా వర్షిణి గురుగ్రామ్ లోని ఖండ్సా ప్రాంతానికి చెందిన యువతి. ఆ యువతికి ఫిబ్రవరి 1వ తారీఖున ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే? డిజిటల్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే.. మంచి లాభాలు వస్తాయని. అందుకోసం ఓ టెలిగ్రాం గ్రూప్ లో చేరి, యూట్యూబ్ లో వచ్చే వీడియోలను చూసి ఓ లైక్ కొట్టడమే అని సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మించారు. నేరగాళ్లు చెప్పినట్లుగానే షాను ప్రియా చేసింది. తొలుత కొన్ని రోజుల పాటు కమిషన్ రూపంలో ఆమెకు కొద్ది మెుత్తంలో మనీ వచ్చాయి. దాంతో ఆ యువతి వారిని మరింతగా నమ్మింది. ఇదే ఆమెకు శాపంగా మారింది. ఇక తమ ప్లాన్ ను అమలు చేశారు సైబర్ నేరగాళ్ళు.. VIP మెంబర్ షిప్ కోసం రూ. 8 వేలు చెల్లించాలని అడగ్గా.. ఆమె చెల్లించింది. దాంతో ఆమెను మరో వెబ్ సైట్లో రిజిస్టర్ చేశారు సైబర్ నేరగాళ్లు.
ఈ క్రమంలోనే మరికొన్ని సార్లు.. సూపర్ వీఐపీ పేరిట డబ్బులు కట్టాలని పలు మార్లు అడగ్గా.. ఆమె పలు దఫాలుగా రూ. 10.75 లక్షలు వారికి చెల్లించింది. అనంతరం ప్రాఫిట్స్ ఎక్కడ అని అడగ్గా.. మరో రూ. 4 లక్షలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు అడిగారు. దాంతో ఆ యువతి మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నైట్ యూట్యూబ్ లో వీడియోలు చూసి లైక్ కొట్టడమే ఆమె పాలిట శాపంగా మారింది. అందుకే గుర్తు తెలియని వక్తుల నుంచి వచ్చే లింక్ లను యాక్సెప్ట్ చెయ్యోద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి వీడియోలకు లైక్ లకు కొడుతూ.. 10 లక్షలు పోగొట్టుకున్న యువతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.