బాంబు బెదిరింపులు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఆకతాయిలు చేస్తున్న ఫేక్ కాల్స్ కారణంతా అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఏదీ, నిజమో, అబద్దమో తెలియక వాళ్లు నానా తంటాలు పడుతున్నారు.
ఇటీవల కాలంలో ఆకతాయిల ఆగడాలు పెచ్చురేగిపోతున్నాయి. వారి ఆనందం కోసం ఎదుటి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. బూటకపు బాంబు బెదిరింపుల వంటి వాటికి తెగబడుతున్నారు. వీటి వల్ల ఏదీ నిజమో, ఏదీ అబద్ధపు కాలో తెలియక అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. మొన్నటి మొన్న ఓ విమానంలో బాంబు పెట్టామని బెదిరింపుతో పాటు ఇటీవల కృష్ణా ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉందంటూ ఫోన్లు చేశారు. అవన్నీ అబద్ధమని తెలిశాక అధికారులు ఊపిరి తీసుకుంటున్నారు. ఇదే సమస్యను ఇప్పుడొక పెద్ద టెక్కీ సంస్థ ఎదుర్కొంది. అదే గూగుల్.
మీకు ఏదైనా సమాచారం కావాలంటే..ఫస్ట్ వెతికేదీ గూగుల్. మొత్తం సమాచారాన్ని నిక్షిప్తం చేసుకున్న ఈ సంస్థ తాజాగా ఓ బెదిరింపును ఎదుర్కొంది. మీ కార్యాలయంలో బాంబు ఉందంటూ పూణెలో ఉన్న గూగుల్ కార్యాలయానికి కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సంస్థ పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం ప్రాంగణమంతా తనిఖీలు చేయగా.. ఎటువంటి ఆధారాలు లభించలేదు. తీరా అది ఫేక్ కాల్ గా పోలీసులు గుర్తించారు. ఇది ఎక్కడి నుండి వచ్చిందనీ దర్యాప్తు చేపట్టగా హైదరాబాద్ లో మూలాలున్నట్లు తేల్చారు. అతడు మద్యం మత్తులో కాల్ చేసినట్లు నిర్ధరించారు.
పూణెలోని ముంద్వా ప్రాంతంలోని బహుళ అంతస్తుల వాణిజ్య భవనంలోని 11వ అంతస్తులో ఉన్న కార్యాలయానికి ఆదివారం రాత్రి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ దేశ్ ముఖ్ వెల్లడించారు. సంస్థ తరుఫున దిలీప్ తాంబే ఈ ఘటనపై ముంబయి బీకెసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్వ్కాడ్ ను ఘటనాస్థలికి పంపి సోదాలు నిర్వహించారు. ఏదీ ఆధారాలు లేకపోయినప్పటికీ..ఇది బూటకపు కాల్ అని నిర్ధారించారు. చివరికీ హైదరాబాద్ కు చెందిన పాణ్యం బాబు శివానంద్ అనే వ్యక్తి కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు.