బంగారం ధరలో మార్పు లేేదు
22 క్యారెట్ 10గ్రా బంగారం 43,900.
24 క్యారెట్ 10గ్రా బంగారం 47,890.
1కిలో వెండి 65,900
బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలో మార్పు లేదు. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 43 వేల 900 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 47 వేల 890 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధర కిలో 700 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 65 వేల 900 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 850 రూపాయలు పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 930 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 380 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,410 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 45,940 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,940 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,050 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,240 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.