తగ్గిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 90 రూపాయలు తగ్గింది
10గ్రా 24 క్యారెట్ 100 రూపాయలు తగ్గింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 43,900.
24 క్యారెట్ 10గ్రా బంగారం 47,890.
1కిలో వెండి 73,100
బిజినెస్ డెస్క్- ఈ రోజు సోమవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 9 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర గ్రాముకు 10 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 90 రూపాయలు తగ్గి 43 వేల 900 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గి 47 వేల 890 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధరలో మార్పు లేదు. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 73 వేల 100 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1850 రూపాయలు తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 2010 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 350 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48, 380 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46, 210 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47, 210 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,130 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50, 320 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.