వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు

gold

తగ్గిన బంగారం వెండి ధరలు
10గ్రా 22 క్యారెట్ 250 రూపాయలు తగ్గింది
10గ్రా 24 క్యారెట్ 270 రూపాయలు తగ్గింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,000.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,000.
1కిలో వెండి 73,100

బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలు కాస్త తగ్గాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 25 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర గ్రాముకు 27 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గి 44 వేల రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 270 రూపాయలు తగ్గి 48 వేల రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు కూడా వెండి ధర 900 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 73 వేల 100 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1900 రూపాయలు తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 2070 రూపాయలు తగ్గింది.

gold

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 300 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48, 300 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47, 350 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48, 350 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,390 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50, 480 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.