స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 300 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 320 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,000.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,000.
1కిలో వెండి 68,200
బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 30 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 32 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 300 రూపాయలు పెరిగి 44 వేల రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 320 రూపాయలు పెరిగి 48 వేల రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 900 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 68 వేల 200 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 800 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 880 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 350 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,310 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,310 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,310 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,300 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,510 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.