దేశ వ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. ఎడతెగని వానల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. అటు నగరాలు, పల్లెల్లోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోతగా వానలు పడుతున్నాయి.
దేశ వ్యాప్తంగా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వానల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు. అటు నగరాలు, పల్లెల్లోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోతగా వానలు పడుతున్నాయి. చెరువులు, వాగులు, వంకలు, నదులు, జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. తెలంగాణలో కూడా తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది. రెండు మూడు రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయి. ముసురు పట్టుకోవడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. అటు బడులకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అటు ఏపీలోనూ వానలు దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావం కారణంగా ఆకాశానికి చిల్లులు పడినట్లు వర్షం కురుస్తుంది.
తుఫాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో గోదావరి నది పొంగి పొర్లుతోంది. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారుతోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల హెచ్చరికలతో బోట్లు ఎక్కడిక్కడ ఒడ్డుకు చేరాయి. యానాంలో సముద్రం ముందుకు దూసుకువస్తుంది. యానాం దగ్గర వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. కాట్రేనికోన మండలం చిర్రయానంలో సముద్రం 100 మీటర్లు ముందుకు వచ్చింది. ముమ్మిడివరం పరిధిలోని గురజాపులంక, ఠాణేలంక, కూనాలంక, గేదెల్లంక, పశువుల్లంక, కన్నపులంక, పొగాకులంక, ఎదుర్లంక, గోగుల్లంక గ్రామాలకు వరదముప్పు పొంచి ఉంది. దీంతో తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భారీ వర్షాల ఎఫెక్ట్: 100 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం! pic.twitter.com/P5dmvx18t0
— Rajasekhar (@Rajasek61450452) July 20, 2023