క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను చిధ్రం చేస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, చదువు, ప్రేమ, ఇతర వ్యక్తిగత సమస్యలను బూతద్దంలో పెట్టుకుని చూస్తూ చావే పరిష్కారమనుకుని భావించి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను చిధ్రం చేస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, చదువు, ప్రేమ, ఇతర వ్యక్తిగత సమస్యలను బూతద్దంలో పెట్టుకుని చూస్తూ చావే పరిష్కారమనుకుని భావించి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. రెప్పపాటులోనే జీవితానికి ముగింపు పలికేస్తున్నారు. అందుకు ఉదాహరణ ఈ కుటుంబం. ఆర్థిక కష్టాలు లేవు. మంచి ఉద్యోగం. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ సొంతిల్లు కూడా కట్టుకున్నారు. బంగారం లాంటి భార్య.. లేక లేక పుట్టిన కుమారుడు. అయితే ఒక చిన్న సమస్య జీవితాంతం వేధిస్తుందని తెలిసి.. బిడ్డను చంపి భార్యాభర్తలిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకరమైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇంతకు వారి లైఫ్‌ను కుదిపేసిన విషయం ఏంటంటే..?
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ముకిలంకుడియిరప్పుకు చెందిన మురళీధరన్ (40), తుక్కలేకు చెందిన శైలజ (36)భార్యా భర్తలు. శైలజ మనాలీలో బయోటెక్నాలజీ పూర్తి చేసింది. 2010లో వీరి వివాహం జరిగింది. పెళ్లైన ఆరు సంవత్సరాల తర్వాత కుమారుడు జీవా పుట్టాడు. పుట్టినప్పుడు బాగానే ఉన్నా.. ఆ తర్వాత అతడిలో అటిజం లక్షణాలు కనిపించాయి. పెళ్లి సమయానికి మురళీ బెంగళూరులోని ఐటి కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబంతో సహా తుక్కలేలోని భార్య స్వగ్రామానికి వచ్చారు. ఆ తర్వాత న్యాయ శాస్త్రం చదివి నాగర్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. మూడేళ్ల కిందట తుక్కేలోని ఓ అద్దె ఇంటికి మారారు. నెల రోజుల క్రితమే సొంత ఇల్లు నిర్మించుకున్నారు. అయితే ఎంత సంపాదించిన కుమారుడ్ని బాగుచేసుకోలేమని భావించిన భార్యా భర్తలు మానసికంగా కుంగిపోయారు. ఈ బాధలో దారుణ నిర్ణయం తీసుకున్నారు. పిల్లవాడికి పాలల్లో నిద్ర మాత్రలు కలిపి తాగించి, ఆపై దిండుతో అదమడంతో చనిపోయాడు.
అనంతరం భార్యా భర్తలిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టారు. అయితే రోజులాగానే శనివారం సాయంత్రం జీవాకు పాలు ఇచ్చేందుకు శైలజ తండ్రి గోపాల్ ఇంటికి చేరుకోగా తలుపు లోపల నుండి తాళం వేసి ఉండటం గమనించారు. ఎన్ని సార్లు తలుపు తట్టినా తెరవలేదు. ఇరుగుపొరుగు వారి సహాయంతో గోపాల్ తాళం పగులగొట్టాడు. ఇంట్లోకి ప్రవేశించగా, హాలులో మురళీధరన్, పక్క గదిలో శైలజ, మంచంపై కుమారుడు విగతజీవులుగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. తుక్కలే పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. మనస్తాపానికి గురైన దంపతులు తమ కుమారుడిని మొదట హత్య చేసి ఆపై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు.