స్పెషల్ డెస్క్- నీతో కలిసి టీ తాగాలని ఉంది.. టైం ఉండి, ఇష్టమైతే వస్తావా.. ఇది ఓ మహిళా సామాజిక కార్యకర్తకు వచ్చిన మెస్సేజ్. అతను ఎందుకు పిలిచాడో తెలియదు కాని.. ఈ మెస్సేజ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు వచ్చిన మెస్సేజ్ ను అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సదరు మహిళా కార్యకర్త. దీంతో అంతా ఈ మెస్సేజ్ గురించే చర్చించుకుంటున్నారు.
ఈ మెస్సేజ్ ను ఓ మామూలు వ్యక్తి పంపి ఉంటే పెద్దగా సీరియస్ అయ్యేది కాదు. ఇలా మెస్సేజ్ పంపింది సాక్షాత్తు ఓ ఐఏఎస్ అధికారు. అవును మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి లోకేష్ కుమార్ జంగిద్ ఓ మహిళా సామాజిక కార్యకర్తను టీకి ఆహ్వానించి వివాదంలో చిక్కుకున్నారు. నీతో కలిసి టీ తాగాలని ఉంది.. సమయం ఉంటే రాగలవా.. అంటూ లోకేష్ తనకు పంపిన మెసేజ్‌ను సదరు మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఐఏఎస్ అధికారి లోకేష్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఐఏఎస్ అధికారి లోకేష్ పంపిన మెస్సేజ్ లో ఏముందంటే.. స్వర భాస్కర్ ట్విటర్ ప్రొఫైల్ చూస్తుంటే మీ ప్రొఫైల్ కనబడింది.. నేను ఈ రోజు, రేపు ఢిల్లీలోనే ఉంటాను.. నీతో కలిసి టీ తాగాలని ఉంది.. నీకు సమయం, ఆకాంక్ష ఉంటే తప్పకుండా రా.. నా గురించి ఏమైనా సమాచారం కావాలంటే గూగుల్‌లో చూడు.. అని సదరు మహళా సామాజిక కార్యకర్తకు ఆయన మెసేజ్ పంపారు. ఈ మెసేజ్‌ను ఆమె నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది నెటిజన్లు ఐఏఎస్ అధికారి లోకేష్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా ఈ అంశంపై లోకేష్ స్పందించారు. సదరు మహిళ కులరహిత సమాజం కోసం పోరాడుతోందని, అందుకే ఆమెను కలవాలని టీకి రమ్మని ఆహ్వానించానని, నేను పంపిన మెసేజ్‌లో అదే ఉందని, అసలు అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఆమెకు పంపిన మెసేజ్‌ను తన ఐడెంటీటీతోనే అధికారికంగా పంపానని, ఆ మెసేజ్‌లో ఎక్కడా విలువలను అతిక్రమించలేదని ఐఏఎస్ అధికారి లోకేష్ కుమార్ చెప్పుకొచ్చారు.