ఈ రోజుల్లో బియ్యం కూడా కల్తీ అవుతోంది! మీరు నకిలీ బియ్యం గురించి వినేవుంటారు. సాధారణ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని కలిపి కల్తీ చెయ్యడం కొన్ని చోట్ల జరుగుతోంది. సాధారణంగా రైతులు పొలంలో వరి నాట్లు వేయాలి, వరి పైర్లకు సరిపడా ఎరువులు, నీరు అందించాలి, పైరు పచ్చగా పండాలి, కోతకు రావాలి, ఆ తర్వాత వరి ధాన్యాన్ని వేరు చేయాలి, ఆ ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపించాలి ఇక్కడ బియ్యం తయారవుతుంది. ఈ ప్రక్రియంతా పూర్తి కావటానికి కొన్ని నెలల సమయం, ఎంతో శ్రమ వెచ్చించాల్సి ఉంటుంది. చైనా వాడికి మాత్రం బియ్య తయారు చేయటానికి నిమిషాల పని. వాడు కొన్ని ప్లాస్టిక్ పేపర్లను పిండి గిర్ని లాంటి మిషన్లలో వేసి బియ్యాన్ని తయారు చేస్తాడు.
చైనా నుంచి ప్లాస్టిక్ బియ్యం పంపిణీ అవుతుందని ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏ వస్తువుకైనా డూప్లికేట్ తయారు చేసి వదిలే చైనా ఇప్పుడు తినే బియ్యాన్ని కూడా కృత్రిమంగా తయారుచేయటం వెగటు పుట్టిస్తోంది. ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని మామూలు బియ్యంతో కలిపేసి మార్కెట్లో విడుదల చేస్తున్నారట. ఇది ఫేక్ న్యూస్ అని కొంతమంది కొట్టిపారేసినా లేటెస్ట్ గా మన గ్రామాల్లో అక్కడక్కడ జరిగిన విషయం ఈ విషాన్ని బైటపెడుతోంది.
శ్రీకాకుళం జిల్లా చిన్నకరివానిపాలెం అంగన్‌వాడీ కేంద్రానికి ఆదివారం సరఫరా చేసిన ‘ఫోర్టిఫైడ్’ బియ్యాన్ని నీటిలో వేసి కడిగితే సగం గింజలు తేలిపోతున్నాయి. వాటిని తీసి చూడగా ప్లాస్టిక్ గింజలు కనిపించాయని బాలింతలు తెలిపారు. దీనిపై సూపర్‌వైజర్‌ను అడిగితే ఆ బియ్యాన్ని వెనక్కి తీసుకుని, నాణ్యమైన బియ్యం అందిస్తామన్నారు. సో బియ్యం కడిగేటప్పుడు జర గమనించండి.