హైదరాబాద్- భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్, త్రివద దళాల అధిపది జనరల్ బిపిన్ రావత్ అకాల మరణం పొందారు. కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. తమిళనాడు నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్లిన బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
ఈ ఘటనపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. రాజకీయ, సినీ ప్రముఖులు బిపిన్ రావత్ ఈ దేశానికి, భారతావనికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. తమిళనాడులో ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన ఘటనలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిచింది. ఈ ప్రమాదం అత్యంత బాధాకరం. అత్యున్నతమైన సీడీఎస్ బాధ్యతలను స్వీకరించిన మొదటి అధికారి అయిన జనరల్ రావత్ దేశానికి అందించిన సేవలు ఎనలేనివని చెప్పవచ్చు.
త్రివిధ దళాలలను సమన్వయ పరిచి, దేశ రక్షణ వ్యవస్థను పటిష్టపరిచే కీలక బాధ్యతల్లో ఉన్న బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటు అని చెప్పకతప్పజు. జనరల్ రావత్, ఆయన సతీమణి శ్రీమతి మధులికలతో పాటు మరో పదకొండు మంది రక్షణ దళాల అధికారులు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం శోచనీయం. ఈమేరకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర దిబ్బ్రాంతి వ్కక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంకి చేకూరాలని కోరుకంటూ, వారి కుటుంంబ సభ్యులను ప్రగా సానుభూతి తెలిపారు.
అటు మోగాస్టార్ చిరంజీవి బిపిన్ రావత్ మృతి నేపధ్యంలో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యాను.. బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య, పదకొండు మంది సైనికులు మరణించిన ఘటన కలవరపరిచింది.. ఆయన మరణం దేశానికి తీరని లోటు.. వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అని చిరంజీవి పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు బిపిన్ రావత్ తో పాటు సైనికుల మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
My heart goes out to the families of our tallest Military officer & First ever Chief of Defence Staff (CDS) Gen.Bipin Rawat,his wife & 11 others who lost their lives in the shocking & tragic chopper crash. It’s a great loss to the entire nation. My deepest condolences. pic.twitter.com/a18kQOoGFa
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2021