ఇంటర్నేషనల్ క్రైం- ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రమూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. షియా ముస్లింలే లక్ష్యంగా కుందుజ్ నగరంలోని మసీదుపై ఈ శుక్రవారం మధ్యాహ్నం జరిపిన బాంబు దాడిలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిలో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.
కాబూల్ కు సమీపంలోని కుందుజ్ ప్రావిన్స్‌లోని బందర్ జిల్లా ఖాన్ అదాబ్‌లోని షియా మసీదులో ఈ బాంబి పేలుడు జరిగిందని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహిల్లా ముజాహిద్ చెప్పారు, ఈ హింసాత్మక ఘటనలో దాదాపు 100 మంది మృత్యువాత పడగా, మరో రెండు వందల మంది తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. బాంబు పేలుడు దాటికి మృతదేహాలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.
షియా మసీదు మొత్తం రక్తంతో తడిసిపోయింది. బాంబు దాటికి మానవ శరీరాలన్నీ రక్తపు ముద్దలుగా మారాయి. బాంబు పేలగానే బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో తీరని విషాదం నిండిపోయింది. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు అఫ్ఘన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంగళవారం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్ లో సిక్కు మైనారిటీల గురుద్వారాపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. సీసీటీవీ కెమెరాలను, ఇతర వస్తువులు, పరికరాలను ధ్వంసం చేశారు. ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ ఇచ్చిన ట్వీట్‌లో ఈ వివరాలను పోస్ట్ చేశారు. ఇంతలో శుక్రవారం షియా మసీదులో బాంబు దాడి జరగడంతో ఆఫ్ఘనిస్థాన్ అట్టుడికిపోతోంది.
Yet another heartbreaking news from #Taliban controlled #Afghanistan .
Over 100 people lost their lives in a bomb blast carried out by Pakistan based #Terrorists .
This blast took place at a mosque in northern Kunduz province .#TalibanTerror #SaveAfghanistan #ImranKhan #Talibans pic.twitter.com/stFwxBgIfJ— Diganta Hazarika (@Diganta701) October 8, 2021