కెవిపి రామచంద్రరావు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. రాజకీయాల్లో కెవిపిగా ఆయన ఎంత పేరు సంపాదించుకున్నారో, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆత్మగా అంతకు మించిన గౌరవాన్ని అందుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను వై.ఎస్ ఒంటి చేత్తో శాశించిన రోజుల్లో కూడా.. కెవిపి చెప్పిందే వేదంగా నడిచింది. అంతటి గొప్ప ప్రాణ స్నేహితులు వారిద్దరూ. కానీ.., రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత పరిస్థితిల్లో మార్పు వచ్చింది. అప్పటి వరకు రాజశేఖర్ రెడ్డికి మాత్రమే విధేయుడిగా ఉంటూ వచ్చిన కెవిపి.. ఒక్కసారిగా పార్టీకి విధేయుడు అయిపోయారు.
కష్ట కాలంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి దూరమయ్యారు. అయితే.., అందుకు జగన్ మోహన్ రెడ్డి వ్యవహర శైలి కూడా కారణమన్న కామెంట్స్ వినిపించాయి. అసలు వైఎస్ మరణం తరువాత ఏమి జరిగింది? తన తండ్రి ప్రాణ స్నేహితుడిని జగన్ ఎలా ట్రీట్ చేశారు? రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కెవిపి రామచంద్రరావు ఎందుకు దూరమయ్యారన్న విషయాలు ఈ నాటికీ బయటకి రాలేదు. అయితే.., సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ అప్పటి నిజాలను బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్.. “బ్లాక్ అండ్ వైట్ విత్ జాఫర్” కార్యక్రమంలో కెవిపి మొదటిసారి ఈ విషయాలపై మౌనం వీడి మాట్లాడారు.
తనదైన ప్రత్యేకతతో పొలిటికల్ ఇంటర్వ్యూస్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ కెవిపి రామచంద్రరావుని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో జాఫర్.. కెవిపిపై ప్రశ్నల వర్షం కురిపించారు. “వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదం రోజు అసలు ఏమి జరిగింది? వైఎస్సార్ బ్రతికి ఉన్నప్పుడు జగన్ తో మీకు విభేదాలు లేవా? వైఎస్సార్ బ్రతికున్న సమయంలో హరీష్ రావు ద్వారా.. టి.ఆర్.ఎస్ పార్టీని చీల్చాలని చూశారా? ఈ విషయంలో హరీష్ రావు సీక్రెట్ గా వైఎస్సార్ ని కలిసింది నిజామేనా? జగన్ ని సీఎం చేయాలన్న ఆలోచన ఎవరిది? వైసీపీ వీక్ అయితేనే కాంగ్రెస్ కి భవిష్యత్తు ఉంటుందా? వైఎస్సార్ మరణం తర్వాత ఆయన ఫ్యామిలీ ని మీరు ఎందుకు వదిలేసారు. అంటూ… కెవిపిపై జాఫర్ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే.., కెవిపి రామచంద్రరావు కూడా ఈ విషయంలో అంతే స్థాయిలో సమాధానాలు ఇచ్చినట్టు ప్రోమో చూసిన వారికి అర్ధం అవుతోంది. రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేసే ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు ఉన్న ఈ ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.