టైటానిక్ షిప్ గురించి ప్రతి ఒక్కరికి ఆశక్తే. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో 1912లో ఏళ్ల క్రితం మునిగిపోయింది. నిజ గాథ ఆధారంగా 1997లో హాలీవుడ్ దర్శక ధీరుడు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించడంతో ప్రపంచ వ్యాప్తంగా టైటానిక్‌పై చర్చనీయాంశమైంది.
టైటానిక్ షిప్ గురించి ప్రతి ఒక్కరికి ఆశక్తే. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో 1912లో ఏళ్ల క్రితం మునిగిపోయింది. నిజ గాథ ఆధారంగా 1997లో హాలీవుడ్ దర్శక ధీరుడు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించడంతో ప్రపంచ వ్యాప్తంగా టైటానిక్‌పై చర్చనీయాంశమైంది. చరిత్రలో అది పెద్ద ఘోరమైన ప్రమాదాల్లో ఇది కచ్చితంగా నిలుస్తుంది. 111 ఏళ్ల క్రితం జరిగిన ఆ పడవ సముద్రంలో మునిగిపోవడంతో 1,500 మందికి పైగా మరణించారు. 1985లో టైటానిక్ శిథిలాలను కనుగొన్నారు. అప్పటినుంచి టైటానిక్‌పై విస్తృత పరిశోధనలు జరిగాయి. అయితే ఈ టైటానిక్ షిప్‌కు సంబంధించిన శిథిలాలు.. వాటికి సంబంధించిన ఫొటోలు ఇటీవల బయటికి వచ్చాయి. దీంతో కొంత మంది ఈ పడవ శకలాలను చూసేందుకు ఓ బృందం బయలు దేరింది. కానీ అంతలోనే ఊహించని ఉపద్రవం ఎదురైంది.
టైటానిక్ శకలాలను చూసేందుకు సబ్ మెరైన్‌లో వెళ్లిన పర్యాటక బృందం ఆచూకీ గల్లంతు అయ్యింది. బయల్దేరిన గంటన్నర తర్వాత 22 అడుగుల పొడవున్న మెరైన్ కమ్యూనికేషన్ కోల్పోయింది. ఇందులో ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ అత్యంత సంపనుల్లో ఒకరైన షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ ఉన్నట్లు సమాచారం. ఆ దేశంలో ఉన్న అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్. మినీ జలాంతర్గామి నిర్వాహకుడు, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టస్ రష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యూకే-యూఏఈ బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రాన్స్‌కు చెందిన పైలట్ పౌల్ హెన్రీ నార్జియోలెట్ కూడా ఉన్నాడు.వీరంతా ఆయా రంగాల్లో ప్రావీణ్యులే.
సబ్ మెరైన్ అదృశ్యమైందన్న సమాచారం అందుకున్న అమెరికా, కెనడా రక్షణ బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి తీవ్రంగా గాలిస్తున్నాయి. పీ-8, సీ-130 విమానాలను గాలింపులో భాగస్వామ్యం చేశారు. మునిగి పోయిన ఆ జలాంతర్గామిలో ఇంకా 72 గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 10,432 కిలోల బరువున్న జలాంతర్గామి 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. టైటానిక్ శకలాలు చూపించేలా ఓషన్ గేట్ అనే సంస్థ నిర్వహిస్తున్న ఈ యాత్ర నిర్వహిస్తోంది. టికెట్ ధర 2.50 లక్షల డాలర్లు అంటే( భారత కరెన్సీలో రూ.2 కోట్లకు పైమాటే). ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ మినీ జలాంతర్గామిలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లున్నాయని ఓషన్ గేట్ కంపెనీ చెబుతోంది.