ఆఫ్ఘనిస్థాన్ ని తాలిబన్స్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు అన్నీ దేశాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. పాకిస్థాన్ ప్రధాని అయితే బాహాటంగా తాలిబన్స్ కి మద్దతు తెలియచేశాడు. ఇప్పుడు చైనా కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. భారత్ మాత్రం ఈ విషయంలో అస్సులు తొందరపడటం లేదు. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఫలితంగా.. దీర్ఘ కాలంలో మనకి వాణిజ్య పరమైన లబ్ది చేకూరాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్స్ వశం అవ్వడం భారత్ కి తీవ్ర నష్టాన్ని కలిగించే అంశమే.
భారత్‌లోని ఆఫ్ఘన్ రాయబారి అధికారులు మాత్రం స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ.., ఆ దేశం ఉపాధ్యక్షుడిని సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇండియన్ గవర్నమెంట్ తాలిబన్స్ తో చర్చలు జరపాలని, వారితో వాణిజ్య పరమైన దౌత్య సంబంధాలను కొనసాగించాలని కామెంట్స్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్ పై అన్నీ వర్గాల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ స్టార్ హీరోయిన్, ప్రస్తుత బీజేపీ నాయకురాలు విజయశాంతి అసదుద్దీన్ ఒవైసీ పై సంచలన కామెంట్స్ చేసింది.
“ఆఫ్ఘనిస్థాన్ తమ ఉపాధ్యక్షుడి అండతో ఇంకా తాలిబన్స్ తో పోరడుతోంది. మరోవైపు మన రాయబారి అధికారులు కూడా అక్కడే ఉన్నారు. ఇలాంటి సమయంలో తాలిబన్స్ తో చర్చలు జరపాల్సిన అవసరం ఏముంది? ఈ మాటల్లో ఆంతర్యం ఏమిటి? ఒవైసీ జీ స్వయంగా కాబూల్ వెళ్ళి, తాలిబన్లలతో చర్చలు జరిపితే సమంజసంగా ఉంటుందేమో” అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. విజయశాంతి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
అంతకన్నా, ఒవైసీ జీ స్వయంగా కాబూల్ వెళ్ళి తాలిబన్లలతో చర్చలు జరిపి వచ్చి, సమాచారం అందిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సమంజసంగా ఉంటుందేమో ప్రయత్నిస్తే మంచిది. pic.twitter.com/01Ool1nNRf
— VIJAYASHANTHI (@vijayashanthi_m) August 18, 2021