హైదరాబాద్- ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతికి హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో విజయశాంతి పిటీషన్ దాఖలు చేయగా, కోర్టు దాన్నికొట్టేసింది. దీంతో విజయశాంతికి నిరాశ ఎదురైంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వ భూముల విక్రయానికి కేసీఆర్ సర్కార్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపేలా ఆదేశించాలని విజయశాంతి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. నిధుల కోసం […]
సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు రాజు చావుపై బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయింది రాజు అని తమకు నమ్మకం లేదని, ఈ విషయానిన పక్కదొవ పట్టించేందుకే ప్రభుత్వం ఎవరిదో శవం తీసుకొచ్చి పెట్టారని ఆరోపించారు. గురువారం బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయశాంతి సింగరేణి కాలనీకి వెళ్లారు. చిన్నారి కుటుంబసభ్యులను ఓదార్చి అనంతరం మీడియాతో మాట్లాడారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఎంతోముద్దుగా ఉన్న ఆ చిన్నారిని […]
ఆఫ్ఘనిస్థాన్ ని తాలిబన్స్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు అన్నీ దేశాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. పాకిస్థాన్ ప్రధాని అయితే బాహాటంగా తాలిబన్స్ కి మద్దతు తెలియచేశాడు. ఇప్పుడు చైనా కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. భారత్ మాత్రం ఈ విషయంలో అస్సులు తొందరపడటం లేదు. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఫలితంగా.. దీర్ఘ కాలంలో మనకి వాణిజ్య పరమైన లబ్ది చేకూరాల్సి ఉంది. ఇలాంటి […]
హైదరాబాద్- తెలంగాణ రాములమ్మ ఎప్పటిలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అదేనండీ బీజేనీ నాయకురాలు, సినిమా నటి విజయశాంతి సీఎం కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో జనానికి అరచేతిలో వైకుంఠం చూపించారని విజయశాంతి ఎద్దేవా చేశారు. బూటకపు కబుర్లతో ప్రజలను నయవంచన చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అనిపించుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు విజయశాంతి. గొల్కొండ కోటపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు వింటే […]
హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైళిపై బీజేపీ నాయకురాలు, సీనియర్ నటి విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్‌లో దళిత బంధు పథకంపై కేసీఆర్ మాటలు.. నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అన్నచందంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికలలో గెలవాలంటే దళిత బంధు ప్రకటించాలని చెప్పడం ద్వారా హుజూరాబాద్‌లో గెలవలేని పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని విజయశాంతి అన్నారు. అంతే కాదు గెలవలేని పార్టీలు హామీలు ఇవ్వంగా లేంది, టీఆర్ఎస్ హామీలు ఇస్తే […]
ఫిల్మ్ డెస్క్- మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అగ్గి రాజేస్తున్నాయి. సాధారణ ఎన్నికలను మించి ఇక్కడ రాజకీయం నడుస్తోంది. మా అధ్యక్ష్య పదవికి పోటీ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ ఇలా చాలా మంది మా బరిలో ఉన్నారు. దీంతో మా ఎన్నికలు కాస్త తెలుగు సినీ పరిశ్రమలో హీట్ ను పెంచేస్తున్నాయి. తాజాగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ […]
హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానంగా ఆమె కేసీఆర్ జిల్లాల్ల పర్యటనలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే జిల్లాల పర్యటనలు కాలక్షేపాన్ని తలపిస్తున్నాయని విజయశాంతి ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతున్న నేపధ్యంలో, కేసీఆర్ కు అక్కడికి వెళ్లే ధైర్యం లేక చుట్టుపక్కల జిల్లాల్లో పర్యటిస్తున్నారని ఆమె కామెంట్ చేశారు. కేసీఆర్ పిచ్చి టూర్లు, మోసపు వాగ్దానాల వలన […]