స్పెషల్ డెస్క్- బిగ్ బాస్.. ఈ రియాల్టీ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తెలుగులో సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. ప్రతివారం ఒక్కో కంటెట్టెంట్ ఎలిమినేట్ అవుతుంటే మరింత ఆసక్తిరేకెత్తిస్తోంది. ఏ వారం ఎవరు బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోతారోనని ఉత్కంఠ రేపుతోంది. బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ ల మద్య వ్యవహారం శృతి మించుతోందన్న విమరశ్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయినప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. వారం వారం బిగ్ బాస్ రియాల్టీ షో మరింత ఆసక్తిరేపుతూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు 12వ ఎపిసోడ్ కు వచ్చేసింది. ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎవరు ఎలినినేట్ అవుతరోనని అందరిలో ఆసక్తి నెలకొంది. వారందరి ఆసక్తికి తెరదింపుతూ.. ఈ 12 వారం నామినేషన్స్ లో భాగంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.
ఈ వారం బిగ్ బాస్ షోలో యాంకర్ రవితో పాటు కాజల్, సిరి, ప్రియాంక, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్.. ఇలా మొత్తం ఏడుగురు ఉండగా.. బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇస్తూ యాంకర్ రవిని ఎలిమినేట్ చేసినట్టు సమాచారం. ఐతే ఓటింగ్ పరంగా చూసుకుంటే బిగ్ బాస్ హౌజ్ లో యాంకర్ రవి టాప్ 3లో ఉన్నాడు. లీస్ట్ లో సిరి, ప్రియాంక, కాజల్‌లు ఉన్నారు. ఏ పోల్ చూసినా ఇదే రిజల్ట్ వస్తుంది.
సిరి, ప్రియాంకలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావచ్చని అందరు అనుకుంటున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ యాంకర్ రవిని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ముందు నుంచి బిగ్ బాస్ హౌజ్ లో చలాకీగా, చాకచక్యంగా గేమ్ ఆడుతూ వస్తున్న యాంకర్ రని హౌజ్ నుంచి వెళ్లిపోవడంతో కొందరు ఆశ్చర్యపోతున్నారు.