డిజిటల్ డెస్క్- రాంగోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద సినీ దర్శకుడు సినిమాల్లో ఎంత పాపులరో.. తనకు సంబందం లేని అంశాలపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడంలో అంతకంటే పాపులర్ అని చెప్పవచ్చు. వర్మ ఎప్పుడు ఎవరి మీద ఏ విదమైన కామెంట్ చేస్తాడో ఎవ్వరికి తెలియదు. రాము ట్వీట్టర్లో టైప్ చేస్తున్నాడంటే ఆరోజు ఎవరికో ఒకరికి మూడిందని చెప్పకతప్పదు. అలా అని అందరిపైనా సెటైర్లు వేయడమే కాదు అప్పుడప్పుడు కొందరిపై సానుకూలంగా కూడా స్పందిస్తారు ఆర్జీవీ. ఇక అసలు విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ లో విజయం సాధించిన మమతా బెనర్జీ పై ప్రశంసలు వర్షం కురిపించిన వర్మ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై సెటైర్లు వేశారు రాంగోపాల్ వర్మ. ట్విటర్ వేదికగా ప్రధాని మోడీకే తనదైన శైలిలో ప్రశ్నలు వేశాడు. నరేంద్ర మోడీ సార్.. నిన్నటి వరకు దీదీ ఫినిష్ అని అన్నారు. మరి ఇప్పుడేమంటారు సార్ అని ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు ఆర్జీవీ.
అంతే కాదు.. నరేంద్రమోడీ మృత్యు వ్యాపారి అంటూ 2014లో సోనియా గాంధీ ఆరోపణలు చేస్తే నాకు అప్పుడు సరిగా అర్థం కాలేదు.. ఆమెకు అంత గొప్ప విజనరీ ఉంటుందని నేను ఊహించలేదని అని మరో ట్వీట్ చేశాడు. సోనియాగాంధీకి తాను బేషరుతుగా క్షమాపణ చెబుతున్నానని.. ఒకవేళ వీలైతే సోనియా గాంధీ కాళ్లను ఫోటో తీసి ఎవరైనా పంపితే … వాటిని డిజిటల్ రూపంలో తాకి మొక్కుతానని తనదైన శైలిలో రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇఖ యధావిధిగానే ఆర్జీవీపై బీజేపీ నేతలు ఫైర్ అవుతోంటే.. కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు.