ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ గెలిచాక వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమా క్రేజ్.. తెలుగు సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయాయి. ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ గెలవడంతో ప్రపంచదేశాల దృష్టి ఇప్పుడు ఇండియన్ సినిమాపై పడింది. ఇప్పటిదాకా టాలీవుడ్ చరిత్రలోనే ఆస్కార్ సాధించిన మొదటి పాటగా నాటు నాటు రికార్డు సెట్ చేసింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడంపై స్పందించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ గెలిచాక వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమా క్రేజ్.. తెలుగు సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయాయి. ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ గెలవడంతో ప్రపంచదేశాల దృష్టి ఇప్పుడు ఇండియన్ సినిమాపై పడింది. ఇప్పటిదాకా టాలీవుడ్ చరిత్రలోనే ఆస్కార్ సాధించిన మొదటి పాటగా నాటు నాటు రికార్డు సెట్ చేసింది. ఒక్కసారిగా దర్శకుడు రాజమౌళితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు హాలీవుడ్ లో పాపులర్ అయిపోయాయి. దీంతో ఆర్ఆర్ఆర్ గురించి.. ఇప్పటివరకు అది సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ.. అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడంపై తనదైన శైలిలో డిఫరెంట్ గా స్పందించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. అతను ప్రశంసలకు పొంగిపోయే రకం కాదు, అలాని విమర్శలకు కుంగిపోయే రకం కూడా కాదు. తాజాగా ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావడంపై రియాక్ట్ అవుతూ ఈ విధంగా కామెంట్స్ చేశాడు. ఆర్జీవీ రియాక్ట్ అవుతూ.. “ఆర్ఆర్ఆర్ కి అవార్డులు వచ్చినా రాకపోయినా.. నా దృష్టిలో పెద్దగా డిఫరెన్స్ కనిపించదు. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ ని ఆల్రెడీ వరల్డ్ వైడ్ ఆడియెన్స్ చూశారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కి అవార్డు రాకపోతే.. అది ఆస్కార్ వాళ్ళ దురదృష్టం” అన్నాడు.
ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ పై వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ.. ‘కొంతమంది ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారని చాలామంది కామెంట్స్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే.. వాళ్ళు ఏమైనా అన్నప్పటికీ నా దృష్టిలో వాళ్ళు ఆర్ఆర్ఆర్ ని లేదా రాజమౌళి గురించి కామెంట్ చేయడమంటే.. చీమ ఏనుగుని కామెంట్ చేసినట్లే. రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లతో ఎవరూ ఊహించని బెంచ్ మార్క్ ని సెట్ చేశాడు. ఇప్పుడు ఆస్కార్ అనేది.. నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కి ఓ మోటివ్ అవుతుంది. అయితే.. రాజమౌళి ఆస్కార్ క్యాంపెయిన్ కి ఎంత ఖర్చు పెట్టాడు అనేది పక్కనపెడితే.. దానికి పదిరెట్లు అతనికి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఫేమ్ తీసుకొచ్చాడు.
ఆ విషయం ఈ కామెంట్స్ చేసే చిన్న బుర్రలకు అర్థం కాదు. మరో విషయం ఏంటంటే.. ముందుగా నేను అవార్డులు అనేది నమ్మను. ఎందుకంటే.. సినిమాకి సంబంధించి కొంతమంది కూర్చొని.. అంటే.. వాళ్ళు ఇంటెలిజెంట్స్ అయ్యుండొచ్చు లేదా ఏమైనా కావచ్చు. నా ఉద్దేశం ఏంటంటే.. సినిమాని కొంతమంది అవుట్ సైడర్స్ కూర్చొని జడ్జి చేయడం అనేది పట్టించుకోను. అందుకే నా కెరీర్ లో ఎప్పుడూ అవార్డుల కోసం నేను సినిమాలు తీయలేదు. అలాగని నాకు పిలిచి ఇచ్చినా నేను వెళ్ళలేదు. నేను ఒకే ఒక్కసారి అవార్డు తీసుకోవడానికి వెళ్ళాను. అది శివ సినిమా కోసం.. అంతే!’ అని వర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ గురించి, అవార్డుల గురించి వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో.. వర్మ కామెంట్స్ పై అభిప్రాయాలను కామెంట్స్ లో తెలిజేయండి.