వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ.. సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటున్నారు. ఇక ఆయన ఏదో ఒక్క వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఆర్జీవీ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో, ఎలాంటి వివాదాన్ని రేపుతారో ఎవ్వరూ ఊహించలేరు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతురావుపై సెటైర్లు వేశారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ.. సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటున్నారు. ఇక ఆయన ఏదో ఒక్క వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఆయన లోకల్ నుంచి ప్రపంచం వరకు ప్రతీ విషయాన్ని టచ్ చేసి కాంట్రవర్సీకి కేంద్ర బిందువు అవుతారు. ఇక అమ్మాయిలు, శృంగారం అనే అంశాలకపై మాట్లాడటం అంటే ఆర్జీవీకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే ఆర్జీవీ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో, ఎలాంటి వివాదాన్ని రేపుతారో ఎవ్వరూ ఊహించలేరు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతురావుపై సెటైర్లు వేశారు. తాతగారు.. మీరు ఇంకా బతికే ఉన్నారా? అంటూ వీహెచ్ పై ఆర్జీవీ సెటైర్లు వేశారు. ప్రస్తుతం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అసలు వివాదం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల ఏపీలోని గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆర్జీవీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళపై వర్మ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మహిళలు అంటే అందమైన వారు.. వారు శృంగారానికి మాత్రమే పనికొస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కొన్ని రోజులుగా రాద్దాంతం నడుస్తూ వచ్చింది. అలానే ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ కూడా ఫైర్ అయ్యారు. సమాజంలో బాధ్యత లేని ఇలాంటి వ్యక్తి ఉండటం దురదృష్టమని, మహిళలను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాంట్ చేశారు.
అంతేకాక మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వర్మపై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ గవర్నర్, సీఎం జగన్ ను కలుస్తానంటూ వీహెచ్ ప్రకటించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న నేటికాలంలో కూడా శృంగారానికి మాత్రమే పనికొస్తారంటూ అసభ్యమైన వ్యాఖ్యలు చేయడమేటని నిలదీశారు. వర్మలాంటి వారి వల్లే మహిళలపై చులకన భావం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఆర్జీవీ అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి బహిష్కరించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
ఓ తాతగారూ మీరింకా వున్నారా??? https://t.co/iLNuYnFqtw NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్ ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్ కి ఆ గతి.. ఒక సారి డాక్టర్ కి చూపించుకొండి😘😘😘 pic.twitter.com/eQAOCkByrh
— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2023
అయితే ఇలా వీహెచ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జీవి స్పందించారు.”ఓ తాతగారు మీరింకా వున్నారా? నాసా చట్టం వర్తించదు.. టీఏడీఏ యాక్ట్ ని 1995లోనే రద్దు చేశారు. ఇలాంటి విషయాలు కూడా తెలియని వారి మూలంగానే కాంగ్రెస్ కి ఆ గతి పట్టిందని, అలానేఓ సారి డాక్టర్ కి వెళ్లి చూపించుకోండి” అంటూ కౌంటర్ వేశారు. ‘నా ఇష్టం నా చావు నేను చస్తాను’ అంటూ గతంలో ఆయన చేసిన కామెంట్స్‌ను రీపోస్ట్ చేశారు. అలానే అమ్మాయిలతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తాతగారు మీరింకా ఉన్నారా? అంటూ వర్మ చురకలు అంటించారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
😂😂😂😍😍😍 https://t.co/Z1sMAkmXxk
— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2023