ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదీ మాట్లాడినా,ఏం చేసినా సెన్సేషనే, ఇటీవల వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించి మీడియాలో హైలెట్ అయ్యాడు. మేయర్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. తాజాగా ఇప్పుడు మరో పోస్టుతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషనే. తనకు నచ్చిందే చేస్తూ, తనకు తోచిందే మాట్లాడుతూ బతికే ఏకైక జీవి రామ్ గోపాల్ వర్మ. తాను అందాన్ని ప్రేమిస్తానంటూ అమ్మాయిలతో ఎక్కువగా గడిపే ఆర్జీవీ ఆడవాళ్ల కాళ్లు పట్టుకోవడానికైనా వెనుకాడడు. అమ్మాయిలతో ఇంటర్వ్యూలు చేసి, తానే కాదూ వారినీ ఫేమస్ చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ బ్యూటీలు అరియానా, అషు రెడ్డిలతో ఇంటర్వ్యూలు చేసి సెన్సేషన్ సృష్టించారు. మరో బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానాతో చేసిన రొమాన్స్ వీడియోతో ఎంతటి రచ్చ అయిందో అందరికీ తెలుసు. ఆమెకు ఈ వీడియోతోనే బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందని ఇండస్ట్రీ టాక్. బహిరంగంగానే శృంగారం గురించి మాట్లాడుతాడు. మగవాళ్లు తనకు గిట్టరు అంటూ ఓపెన్‌గా నే చెబుతారు.
ఆర్టీవీలో రొమాంటిక్ యాంగిలే కాకుండా రచయిత కూడా ఉన్నాడు. ఆయన పలు పుస్తకాలు రాస్తూ ఉంటారు. నా ఇష్టం పేరుతో గతంలో ఓ బుక్ తెచ్చారు. గతంలో ప్రముఖ యాంకర్ స్వప్నతో కలిసి చేసిన ప్రోగ్రామ్ ‘రామూయిజం’ఎపిసోడ్లల నుంచి పలు అంశాలను స్వీకరించి ‘బ్లూ బుక్’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. దాని కవర్ పేజీపై గౌతమ బుద్ధిని పోలికలతో తన ఫోటో వేయించారు. ఇది గత నెలలో విడుదల చేశారు. ఏ అంశంపైనైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. మొన్నటి మొన్న వీధి కుక్కల దాడికి సంబంధించిన ఘటనలో ఓ ప్రముఖ ఛానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనదైన స్టైల్స్ లో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా మేలుకో జీహెచ్ఎంసీ అంటూ మరో ఘటన తాలూకా వీడియోను పంచుకుని.. తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఓ ట్వీట్ చేశారు.
అయితే ఆయన నటీమణులతో చేస్తున్న ఇంటర్వ్యూలు కానీ, డ్యాన్సులు కానీ ఎంత ఫేమస్ అవుతాయో, అంతే కాంట్రవర్సీయల్స్ గా మిగులుతాయి. అషు రెడ్డితో ఇటీవల చేసిన ఇంటర్వ్యూలో ఆమె కాళ్ల దగ్గర కూర్చొని, ఆమె కాలిని నోటితో తాకిన ఘటన ఒక్కసారిగా సంచలనం కలిగింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా మన ఆర్జీవీ అవేమీ పట్టించుకోరు. తన స్టైల్స్‌లో తన పని తాను చేసుకుంటూ పోతారు. తాజాగా ఆర్జీవీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ఆ ఫోటోలో చేతికి మల్లెపూల దండ చుట్టుకుని..పక్కనే వోడ్కా గ్లాసుతో ఓ అమ్మాయి అరచేతిని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు ఆర్జీవీ. తన్మయత్వంతో కళ్లు మూసుకుని రసికతను ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి ఆయన ‘పాదాలే కాదూ చేతులు కూడా’అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక ఆర్జీవీ ఫోటోను చూసి నెటిజన్లు ఊరు కోరు కదా.. తమదైన స్టైల్స్ లో కామెంట్లు పెడుతున్నారు. ఆర్జీవీ తనకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Not just feet .. it’s Hands too ! pic.twitter.com/8ZLuG4xPKd
— Ram Gopal Varma (@RGVzoomin) March 10, 2023