'నాటు నాటు' పాటకు ఆస్కార్ వచ్చింది. కానీ కీరవాణికి ఇది అంత నచ్చిన సాంగ్ అయితే కాదు. ఇది మేం చెబుతున్న మాట కాదు స్వయానా ఆయనే అన్నారు. ఇంతకీ ఏంటి విషయం?
టాలీవుడ్ కి ఆస్కార్ రావడం ఓ కల. కానీ దాని నిజం చేసి చూపించాడు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. తను తీసిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకుంది. ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేసింది. ఇప్పుడు అదంతా పాతబడిపోయింది. కానీ సడన్ గా ఈ పాటపై, స్వయానా దాన్ని కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు కీరవాణి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అసలు ఇది తన బెస్ట్ సాంగ్ కాదని అన్నారు. ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొస్తే.. ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ రావడం, అందరూ సెలబ్రేట్ చేసుకోవడం, దాని గురించి మర్చిపోవడం కూడా జరిగిపోయింది. అలాంటిది సడన్ గా కీరవాణిని ఇంటర్వ్యూ చేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ‘ఆస్కార్ వెనక నాటు నిజం’ పేరుతో ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా నాటు నాటుకు ఆస్కార్ దక్కడం గురించి ఆర్జీవీ ప్రశ్నించారు. ‘ఈ పాటని వేరే ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసి, ఆస్కార్ వచ్చుంటే.. దానికి అర్హత ఉందని మీరు భావించేవారా’ అని అడగ్గా.. ‘ఈ పాటకు ఆస్కార్ రావడానికి చాలా కారణాలున్నాయి. అవన్నీ తర్వాత చెప్తాను. జస్ట్ ఓ పాటగా తీసుకుంటే మాత్రం ఆస్కార్ వచ్చినందుకు నేను ఫీల్ కాను. ఎందుకంటే జయహో సాంగ్ కు వచ్చినప్పుడు కూడా నేను ఫీల్ అవలేదు కాబట్టి’ అని కీరవాణి బదులిచ్చారు.
నాటు నాటు సాంగ్ మీ కెరీర్ లో టాప్-100లో ఉంటుందని అనుకుంటున్నారా అని ఆర్జీవీ అడగ్గా.. ‘లేదు’ అని కీరవాణి సమాధానమిచ్చారు. ‘ఏదైనా ఒకటి క్రియేట్ చేసినప్పుడు, అవతలి వాళ్లకు నచ్చాలి అని పనిచేస్తున్నప్పుడు అది ముందు మనకు నచ్చాలి. నాకే నచ్చకపోతే ప్రపంచానికి నచ్చుతుందని నేను ఎలా అనుకుంటాను.’ అని అన్నారు. దీనిబట్టి చూస్తే.. కీరవాణికి ‘నాటు నాటు’ నచ్చినా సరే తను కంపోజ్ చేసిన వాటిలో అదేమంత గొప్ప సాంగ్ కాదని వివరణ ఇచ్చినట్లే! మరి దీనిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.