వెండి తెరపై విలన్గా సోనూ చాలా మందికి తెలుసు. కానీ ఆయనను ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ‘హీరో’ అంటూ పొగుడుతున్నారు. వెనుక ముందు ఏం ఆలోచించకుండా సాయం చేస్తున్న సోనూ సూద్ ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న సాయం నుంచి సాధ్యం కాదు అన్నుకున్న సాయం కావాలన్నా అందరి చూపూ సోనూ సూద్ వైపే ఉంటోంది. సెలబ్రిటీలు సైతం సాయం కోసం సోనూను ఆశ్రయిస్తున్నారు అంటే పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు కరోనా కాటు. మరోవైపు బ్లాక్ ఫంగస్ పంజా. వీటన్నిటికీ తోడు అనారోగ్య సమస్యలతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలామంది ఇప్పుడు ఇంజెక్షన్ల కోసం సోనూ సూద్ ను సాయం కోరుతున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య ప్రాణాపాయ స్థితిలో ఉందని ఆమెకు కవాల్సిన ఇంజెక్షన్ దొరకడం లేదంటూ సోనూ సూద్ కు ట్వీట్ చేస్తూ ఆదుకోవాలని కోరాడు. అయితే ఆ ఇంజెక్షన్ దొరకడం కష్టమే అయినా సోనూ సూద్ పెద్ద మనసు చేసుకుని దాన్ని బాదితుడికి అందేలా చేశారు. అయితే ఆ తర్వాత కోపం కూడా వచ్చింది. అందుకే ట్విట్వర్ వేదికగా వైద్యులను ఓ ప్రశ్న అడిగారు. ఒక ఇంజెక్షన్ ఎక్కడా దొరకడం లేదని వైద్యులకు తెలిసినప్పుడు దాన్ని వైద్యులు ఎందుకు రికమండ్ చేస్తున్నారని ప్రశ్నించారు.
పెద్ద పెద్ద ఆసుపత్రులకే దొరకని పరిస్థితి ఉంటే అది సామాన్యులకు ఎలా దొరుకుతుంది అని అనుమానం వ్యక్తం చేశాకె. ఆ ఇంజెక్షన్ దొరకడం కష్టమని తెలిసిన తరువాత ప్రత్నామ్నాయాలను ఎందుకు చూడడం లేదో తనకు అర్థం కావడం లేదనంటూ సోనూ ప్రశ్నించారు. సోనూ చేసిన ఈ ట్వీట్ చూసి నెటిజన్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడా దొరకని ఇంజెక్షన్లు సామాన్యులకు ఎక్కడ లభిస్తాయి. సోనూ వేసిన ఈ ప్రశ్న పరిగణలోకి తీసుకోవాల్సిందే అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.