టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో పాటు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసి క్రేజ్ సంపాదించుకుంటున్నవారు కూడా ఉన్నారు. యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు. కానీ.. అదొక్కటే ముఖ్యం కాదు. తెలుగులో కొంతమంది మాత్రమే ప్రెజెంట్ ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని.. యూత్ ఫుల్ కంటెంట్ తో దూసుకుపోతున్నారు. ఆ విధంగా యూత్ ఫుల్ కంటెంట్ తో అలరిస్తున్నవారిలో దొర సాయితేజ ఒకరు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎంతోమంది తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ సెలెబ్రిటీ హోదా అందుకుంటున్నారు. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో పాటు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసి క్రేజ్ సంపాదించుకుంటున్నవారు కూడా ఉన్నారు. యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు. కానీ.. అదొక్కటే ముఖ్యం కాదు. జనాలకు ఎలాంటి కంటెంట్ కంటెంట్ ఇస్తున్నామనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలుగులో ఎంటర్టైన్ మెంట్ కంటెంట్ అందిస్తూ షార్ట్ ఫిలిమ్స్ చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ.. కొంతమంది మాత్రమే ప్రెజెంట్ ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని.. యూత్ ఫుల్ కంటెంట్ తో దూసుకుపోతున్నారు.
ఆ విధంగా యూట్యూబ్ లో యూత్ ఫుల్ కంటెంట్ తో అలరిస్తున్నవారిలో దొర సాయితేజ ఒకరు. చిన్న వయసులో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేసి.. ఇప్పుడు ఏకంగా 7 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్స్ తో రాణిస్తున్నాడు. దొర సాయితేజ అంటే.. అందరికీ గుర్తుండకపోవచ్చు. ‘బ్యాక్ బెంచర్స్’ అనే వెబ్ సిరీస్ పేరు వినగానే గుర్తుపట్టే అవకాశం ఉంది. అవును.. ఆ బ్యాక్ బెంచర్ సిరీస్ హీరో, క్రియేటర్ రెండూ దొర సాయితేజనే. యూట్యూబ్ లోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని.. క్రేజ్ సంపాదించుకున్న సాయితేజకి జంటగా సోషల్ మీడియా స్టార్ వర్ష డిసౌజా కూడా బాగా పాపులర్ అయ్యింది. వీరి జంటకి యూట్యూబ్ లో మంచి క్రేజ్ ఉంది.
ఈ క్రమంలో ఎవరికైనా డ్రీమ్ హోమ్ నిర్మించుకోవాలని లేదా ఉన్న ఇల్లునే తమ ఇష్టాలకు అనుగుణంగా డిజైన్ చేయించుకోవాలని ఆలోచనలు ఉంటాయి. సాయితేజ కూడా తన ఇంటిని ఇష్టాలకు తగినట్లుగా డిజైన్ చేసుకున్నాడు. కాగా.. తాజాగా సాయితేజ ఇంట్లో ప్రముఖ టీవీ ఛానల్ వారు హోమ్ టూర్ వీడియో చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సాయితేజ తన కెరీర్ గురించి, స్టడీస్ గురించి.. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పిన విషయాలు హైలైట్ అవుతున్నాయి. దొర సాయితేజ ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ నుండి సెలబ్రిటీ హోదా వైపుగా అడుగులు వేస్తున్నాడు. మరి దొర సాయితేజ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.