ప్రతిభ ఉన్న వారు క్రియేటివిటిని ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా వెలుగులోకి వస్తున్నారు. రీల్స్, వీడియోలు చేసి అనతి కాలంలోనే ఫేమస్ అయిపోతున్నారు. స్మార్ట్ ఫోన్ కొందరి జీవితాలను బంగారు మయంగా మార్చేసింది.
టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో పాటు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసి క్రేజ్ సంపాదించుకుంటున్నవారు కూడా ఉన్నారు. యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు. కానీ.. అదొక్కటే ముఖ్యం కాదు. తెలుగులో కొంతమంది మాత్రమే ప్రెజెంట్ ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని.. యూత్ ఫుల్ కంటెంట్ తో దూసుకుపోతున్నారు. ఆ విధంగా యూత్ ఫుల్ కంటెంట్ తో అలరిస్తున్నవారిలో దొర సాయితేజ ఒకరు.