ప్రతిభ ఉన్న వారు క్రియేటివిటిని ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా వెలుగులోకి వస్తున్నారు. రీల్స్, వీడియోలు చేసి అనతి కాలంలోనే ఫేమస్ అయిపోతున్నారు. స్మార్ట్ ఫోన్ కొందరి జీవితాలను బంగారు మయంగా మార్చేసింది.
యూట్యూబ్ లో ఛానల్ ను క్రియేట్ చేసుకున్న యూట్యూబర్స్ వ్లాగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు ఇతరత్రా వీడియోలు చేస్తూ తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకుంటున్నారు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించే నటించే నటీనటులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇదే అంశానికి చెందిన ఫెమస్ వెబ్ సిరీస్ అయినటువంటి బ్యాక్ బెంచర్స్ లో నటించిన నటీనటులు దొర సాయి తేజ, వర్ష డిసౌజ. బ్యాక్ బెంచర్స్ వెబ్ సిరీస్ ద్వారా వీరిద్దరు భారీ ఫాలోయింగ్ ను సంపాధించుకున్నారు.
కాలేజ్ విద్యార్థుల జీవితాలను తెలిపే దిశలో రూపుదిద్దుకున్నదే ఈ బ్యాక్ బెంచర్స్ వెబ్ సిరీస్. ఇందులో దొర సాయి తేజ ఇంట్రోవర్ట్ గా, భయస్తుడిగా ఉండేటువంటి విద్యార్థి పాత్రలో అలరించాడు. వర్ష డిసౌజ ఆత్మవిశ్వాసం కల్గిన విద్యార్థినిగా దొర సాయి తేజతో స్నేహం చేస్తూ అతడిని సిగ్గు, బిడియం బయట పడేలా చేసే పాత్రలో ఆకట్టుకుంది. ఆన్ స్క్రీన్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి విశేషమైన ఆదరణ లభించింది.
వీరి నటనకు విమర్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న వీరిద్దరు బ్యాక్ బెంచర్స్ వెబ్ సిరీస్ ను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. దొర సాయి తేజ, వర్ష డిసౌజ మాట్లాడుతూ ఆఫ్ లైన్ లో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మని ఇదే అంశం ఆన్ లైన్ లో మా మధ్య కెమిస్ట్రీ కి సహాయపడిందని తెలిపారు. మరోవైపు ప్రేక్షకులు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని రాబోయే వెబ్ సిరీస్ లలో ఈ జంట కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.