ప్రస్తుతం ఓ సినిమా హిట్ అవ్వాలంటే.. పెట్టిన పెట్టుబడి అంతా మొదటి రోజే రావాలంటే.. దాన్ని సరైన రీతిలో ప్రమోషన్ చేయాలి. అందుకే ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు. కానీ వివాదాన్ని మించిన ఫ్రీ ప్రమోషన్ మరోటి ఉండదని ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్ర ఫ్రాంక్ వీడియోతో మరోసారి నిరూపితం అయ్యింది. తన సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ చేసిన ఫ్రాంక్ వీడియోపై దుమారం రేగింది. దీనిపై ఓ టీవీ చానెట్ డిబేట్లు పెట్టడంతో వివాదం మరితం ముదిరింది. తనని వ్యక్తిగతంగా ఎటాక్ చేస్తున్న ఛానల్‌కి డైరెక్ట్‌గా వెళ్లి లైవ్ డిబేట్లో కూర్చున్నాడు విశ్వక్ సేన్. ఆ డిబేట్ నిర్వహిస్తున్న యాంకర్ దేవితో మాట మాటా పెగిగి.. చివరకు బూతులు వాడేవరకు వెళ్లింది. ఈ క్రమంలో దేవి నాగవల్లి.. విశ్వక్‌ను ఉద్దేశించి.. గెటౌట్ అని విరుచుకుపడటంతో.. విశ్వక్ సేన్ ఏకంగా F*** అనే బూతుని వాడటంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఇది కూడా చదవండి: విశ్వక్ సేన్ v/s దేవి నాగవల్లి: మొదట సహనం కోల్పోయింది ఎవరు?
ఇక ఈ వివాదంలో నెటిజనులు రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకుంటున్నారు. చాలా మంది దేవి నాగవల్లి.. విశ్వక్‌ని ఉద్దేశించి పాగల్, డిప్రెస్స్‌డ్ పర్సన్ అనడంతోనే అతను సహనం కోల్పోయాడు. అదే విశ్వక్ స్థానంలో మరొకరు ఉంటే.. దేవి ఇలానే మాట్లాడేదా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి కొందరు దేవి ఎలా మాట్లాడిన.. విశ్వక్ F పదం వాడటం కరెక్ట్ కాదు అంటున్నారు నెటిజనులు. మొత్తం మీద ఈ వివాదంలో ఓ మహిళా యాంకర్ని పట్టుకుని బూతులు మాట్లాడటం తప్పని విశ్వక్ సేన్‌ని తప్పుపట్టేవాళ్లు కొందరైతే.. గెస్ట్‌గా వచ్చిన హీరోని గెటౌట్ అంటూ అవమానించడం ఎంతవరకూ కరెక్ట్ అని అతన్ని సమర్ధించే వాళ్లు ఉన్నారు. అయితే ఈ వివాదంలో చాలా మంది మద్దతు మాత్రం విశ్వక్ సేన్‌కే లభిస్తోంది. నెటిజన్లు విశ్వక్ సేన్‌కి మద్దతు ప్రకటిస్తూ యాంకర్‌పై విరుచుకుపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Devi Nagavalli – Vishwak Sen: దేవి – విశ్వక్ వివాదంలోకి బాబు గోగినేని! పోస్ట్ వైరల్!
ఈ నేపథ్యంలో సినీ నటి కరాటే కళ్యాణి విశ్వక్ సేన్‌కి మద్దతు ప్రకటిస్తూ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి.. ఈ ఇష్యూలోకి యాంకర్ అనసూయని లాగేసింది. ‘‘3*3 టీవీ వర్సెస్ సేన్లో పూర్తిగా టీవీ వాళ్లదే తప్పు. నేను ఆ హీరోకే సపోర్ట్ చేస్తా. అనసూయ ఎన్నిసార్లు F** పదం వాడినప్పుడు నువ్వు రోడ్డు మీద డాన్స్ చేసినప్పుడు ఏమైంది అమ్మ?’’ అంటూ చురకలు అంటించింది కరాటే కళ్యాణి. ఇది చూసిన నెటిజనులు.. కరాటే కళ్యాణికి మద్దిస్తున్నారు. మీరు మాట్లాడింది కరెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కళ్యాణి.. విశ్వక్‌కు మద్దతు తెలపడం వరకు ఓకే కానీ.. ఈ వివాదంలోకి అర్జెంట్‌గా అనసూయని ఎందుకు లాగిందో అర్థం కాలేదు అంటున్నారు నెటిజనులు.
ఇది కూడా చదవండి: Vishwak Sen: తన విషయంలో జరుగుతున్న చర్చపై మోకాళ్లపై కూర్చుని విశ్వక్ సేన్ ఎమోషనల్!
ఇక మరోవైపు బాబు గోగినేని కూడా విశ్వక్ సేన్‌కి మద్దతు ప్రకటిస్తూ.. గతంలో అనసూయ F** అనే పదాన్ని వాడిన వీడియోను షేర్ చేశారు. టీవీ 9 ఛానల్లోనే.. అది కూడా యాంకర్ దేవి ఉండగానే అనసూయ ఆ పదాన్ని వాడటం ఇక్కడ ట్విస్ట్. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.