రీసెంట్ సెన్సేషన్ ‘బేబి’ మూవీ మూడో వారంలోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్‌కెఎన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఈ ఎంటర్‌టైనర్ కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
రీసెంట్ సెన్సేషన్ ‘బేబి’ మూవీ మూడో వారంలోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్‌కెఎన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఈ ఎంటర్‌టైనర్ కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా సక్సెస్ సెలబ్రేషన్స్ చేశారంటే సినిమా రేంజ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, మాస్ మహారాజా రవితేజ సహా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా తమ స్పందన తెలియజేశారు. ఓవైపు ‘బేబి’ టీమ్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుండగానే మరోవైపు డైరెక్టర్ సాయి రాజేష్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ల మధ్య నెట్టింట కోల్డ్ వార్ నడుస్తోంది. మొదట ‘బేబి’ కథ ఓ హీరోకి చెప్పాలనుకుంటే అతను కనీసం కలవడానికి కూడా ఇష్ట పడలేదంటూ రాజేష్ చెప్పడం, ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న విశ్వక్ దానికి రియాక్ట్ అవడం జరిగింది.
అయితే వీళ్లిద్దరూ పేర్లు రివీల్ చేయకపోయినా పరోక్షంగా మేటర్ ఏంటనేది అర్థమైపోయింది. విశ్వక్ వ్యాఖ్యలపై తాజాగా సాయి రాజేష్ రెస్పాండ్ అయ్యాడు. ‘‘విశ్వక్ సేన్‌కు ‘బేబి’ కథ చెప్పాలనుకున్నది నిజమే. కానీ అతను వినలేదు. దీనికి కారణం ఏంటో కూడా నాకు తెలియదు. బహుశా అతడి ప్రయారిటీ డెరెక్టర్స్ లిస్ట్‌లో నేను లేకపోయి ఉండొచ్చు. విశ్వక్ ‘బేబి’ మూవీకి నో చెప్పిన విధానం నాకు నచ్చలేదు. అతను వద్దనుకున్న సినిమా హిట్ అయ్యింది. సక్సెస్‌ని ఎంజాయ్ చేయాలి కానీ ఎదుటివారిని అవమానించొద్దని విశ్వక్ సేన్ అనే సరికి చాలా బాధపడ్డా’’ అని సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు.
‘‘అయితే ‘బేబి’ మూవీని రిజెక్ట్ చేశాడని అన్నాను గానీ ఎక్కడా కూడా అతని పేరు చెప్పలేదు. హీరోల రిజెక్షన్ అనేది రెస్పెక్టబుల్‌గా ఉంటే బాగుంటుందనేది నా ఒపీనియన్. ఈ విషయంలో నాకు విశ్వక్ మీద ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే అతను హీరోగా చేసిన ఫస్ట్ ఫిలిం ‘వెళ్లిపోమాకే’ రిలీజ్ కోసం నేనెంతో కష్టపడ్డాను. అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతలకు చూపించి, ఆ చిత్రాన్ని విడుదల చేయించాను’’ అన్నాడు. సాయి రాజేష్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.
ఇది కూడా చదవండి : బేబి హీరోయిన్‌పై ఇంత అనురాగం చూపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా?