సినిమాను ప్రమోట్ చేసే విధానంలో కొంత మంది మూవీ మేకర్స్ హద్దులు దాటుతున్నారు. ప్రైవెట్‌గా చేయల్సిన పనులను స్టెజ్ మీద చేస్తున్నారు. ఇలా చేయండం వల్ల పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుందని తెలిసినా.. ఇలాటి పనులు చేస్తునరని కొందరు అభిప్రాయపడుతున్నారు.
సినిమాను ప్రమోట్ చేసుకునే విధానం మారుతూ వస్తోంది. ఒక్కో హీరోది ఒక్కో ట్రేండ్. ఒక్కో హీరోయిన్‌ది ఒక్కో స్టైల్. ఇప్పుడు సినిమాను ఎంత కొత్తగా ప్రమోట్ చేస్తే అంతగా జానాల్లోకి వెళ్తుంది. అందరూ తమ తమ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు నానా రకాలుగా పాట్లు పడుతూ.. ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో ఎవరి స్టైల్ వారిది అందులో విజయ్, విశ్వక్ లది మరో స్టైల్ సినిమా ప్రమోషన్స్ లో ఎంత దూకుడుగా ఉంటున్నారో అందిరికీ తెలిసిందే. మొన్న విజయ్ దేవరకొండ “ఖుషి మ్యుజికల్ కాన్సర్ట్”లో ఎంతగా రచ్చ చేశాడో అందరికీ తెలిసిందే. స్టేజ్ మీద షర్ట్ విప్పి.. సమంతను ఎత్తుకొని డ్యాన్స్ చేశాడు. ఇక సమంత, విజయ్ ఆ ఈవెంట్‌కే హైలెట్ గా నిలిచారు.
దాంతో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రెంజ్ లో ఉందో అందరికీ క్లారీటిగా అర్ధంమైంది. కానీ దాని మీద జనాలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంత చేయడం అవసరమా.? అంటూ కామెంట్లు విసురుతున్నారు. షర్ట్ విప్పడం ఎంటీ.. ఇదేమైనా రోమాంటిక్ షో అనుకుంటున్నావా అంటూ.. తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా విశ్వక్ సేన్, నేహా శెట్టిలు కూడా కాస్త హద్దులు దాటారు. వీరిద్దరూ కలిసి “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి సుట్టంలా సూసి అనే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పాటను నిన్న రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా హీరో హీరోయిన్లు కలిసి స్టేజ్ మీదే నానా హంగామా చేశారు. మొత్తానికి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.
సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రూల్స్ రంజన్ సినిమా నుంచి నేహా శెట్టి చేసిన సాంగ్, డ్యాన్స్ రీల్ వీడియో ఇప్పుడు ఎంతగా ట్రెంట్ అవుతోందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పాటను కూడా ట్రెండ్ చేయలని ఫిక్స్ అయినట్టుంది నేహా శెట్టి. అందుకే స్టేజ్ మీదే హీరోతో కలిసి రచ్చ చేసింది. హుక్ స్టెప్ వేసింది. తన చీరను విప్పి.. హీరోకు కప్పి.. ఈ ఇద్దరు కలిసి స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ విడియో మీద నెట్టిజన్లు బూతులతో విరుచుకుపడుతున్నారు. స్టేజ్ మీద ఇలాంటి పనులు చేయడం అవసరమా. మీరు చేసే పనుల వల్ల సినీ పరిశ్రమ నశనం అవుతోంది అంటూ.. ఫైర్ అవుతున్నారు. నేహాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు. డిజే టిల్లు సినిమాతో తెలుగులో తిరుగులేని క్రేజ్, పాలోయింగ్ వచ్చింది.
Following The Trend set by #VijayDeverakonda last night, #VishwakSen Romanced with #NehaShetty as part of his upcoming film’s Promotions! pic.twitter.com/8c0Me4et1T
— Daily Culture (@DailyCultureYT) August 16, 2023